Ram Charan : ఖైరతాబాద్ RTO ఆఫీస్ లో గ్లోబెల్ స్టార్ ..సెల్ఫీ ల కోసం పోటీ

Global Star : ఈ ఏడాది జులైలో ఆయన రోల్స్ రాయిస్ స్పెక్టర్ ను కొనుగోలు చేసి, తన లగ్జరీ కార్లలో జత చేసారు. మొదటి నుండి చరణ్ కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. మార్కెట్ లోకి కొత్తగా లగ్జరీ కారు వచ్చిందంటే చాలు దానిపై ఫోకస్ పెట్టి

Published By: HashtagU Telugu Desk
Charan Rto Office

Charan Rto Office

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈరోజు (అక్టోబర్ 22) ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి (Khairatabad RTO Office) తన కొత్త రోల్స్ రాయిస్ కారు (Rolls-Royce Spectre EV) రిజిస్ట్రేషన్ (Registration) కోసం వచ్చారు. అధికారులు ఆయన్ను ఆత్మీయంగా రిసీవ్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం కార్యాలయంలో అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. మెగా ఫ్యామిలీకి ఇప్పటికే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుంది. ఇది రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి (Chiranjeevi)కు గిఫ్ట్‌గా ఇచ్చారు. తాజాగా ఈ ఏడాది జులైలో ఆయన రోల్స్ రాయిస్ స్పెక్టర్ ను కొనుగోలు చేసి, తన లగ్జరీ కార్లలో జత చేసారు. మొదటి నుండి చరణ్ కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. మార్కెట్ లోకి కొత్తగా లగ్జరీ కారు వచ్చిందంటే చాలు దానిపై ఫోకస్ పెట్టి..బాగుంటే దాన్ని వెంటనే కొనుగోలు చేస్తారు.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls-Royce Spectre) విషయానికి వస్తే ..

రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls-Royce Spectre) బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీదారు రోల్స్-రాయిస్ పరిచయం చేసిన సరికొత్త మోడల్ కార్. ఇది రోల్స్-రాయిస్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. 2023లో ఇది విడుదలైంది. స్పెక్టర్ సిరీస్‌లో అధిక లగ్జరీ, శ్రేష్టమైన పనితీరు మరియు అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

కారు ప్రత్యేకతలు (Rolls-Royce Spectre features) చూస్తే..

డిజైన్: స్పెక్టర్ అనునయమైన లైన్లు మరియు క్రీమ్ కలర్ ఫినిష్‌తో అనేక ఫీచర్లు కలిగి ఉంటుంది, ఇది ఆహ్లాదకరమైన మరియు ఖచ్చితమైన రవాణా అనుభవాన్ని అందిస్తుంది.

పనితీరు: ఇది పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ట్రైన్‌ను కలిగి, కఠినమైన సమయానికి త్వరగా స్పందించే సామర్థ్యం ఉంటుంది.

ఇంటీరియర్స్: రోల్స్-రాయిస్ తమ గాడ్జెట్‌లను అందంగా మరియు కస్టమైజ్ చేసేందుకు వీలు కల్పించే అనేక స్వాధీనం, సరిపోయే సౌకర్యాలతో శ్రేష్ఠమైన ఇంటీరియర్స్ అందిస్తుంది. ప్రత్యేకమైన పీడలతో, ప్రీమియం పదార్థాలను ఉపయోగించి రూపొందించబడింది.

టెక్నాలజీ: స్పెక్టర్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కస్టమ్-బిల్ట్ డాష్‌బోర్డ్స్, ఇంటెరాక్టివ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది.

Read Also : The RajaSaab : ‘రాజాసాబ్’ నుండి మరో పోస్టర్..ఈసారి తలకిందులు చేశారు

  Last Updated: 22 Oct 2024, 07:51 PM IST