టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja)కు హైదరాబాద్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నిర్మాణంలో ఉన్న ఓ కమర్షియల్ భవనంలో ఏర్పాటు చేసిన మాంగల్య షాపింగ్ మాల్(Mangalya Shopping Mall)ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) లేకుండానే మాల్‌ను ప్రారంభించడమే దీనికి కారణమని తెలుస్తోంది. అధికారులు విచారణ చేపట్టి తక్షణ చర్యలుగా మాల్‌ను మూసివేశారు. ఈ భవనంలో నాలుగు, ఐదు అంతస్తుల్లో మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంగణంలో ఏషియన్–రవితేజ (ART Cinemas) సినిమాస్ పేరుతో కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మాల్‌పై సీజ్ ఆర్డర్ రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.
Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ
ఈ ఘటన చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏషియన్ సినిమాస్ మహేష్ బాబు (AMB) మరియు అల్లు అర్జున్ (AA Cinemas)లతో కలిసి మల్టీప్లెక్స్‌లను విజయవంతంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రవితేజతో కలిసి ART సినిమాస్‌ను నిర్మించేందుకు వారు ముందుకు వచ్చారు. రవితేజ ప్రస్తుతం “మాస్ జాతర” చిత్రంతో బిజీగా ఉండగా, మరో కొత్త ప్రాజెక్ట్‌కూ కమిట్ అయినట్టు సమాచారం. ఈ మాల్ వివాదంపై ఇంకా రవితేజ గానీ, ఏషియన్ సినిమాస్ గానీ అధికారికంగా స్పందించలేదు. తక్షణ చర్యల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.