Krishna : కృష్ణ మొదటి వర్థంతి.. నివాళులు అర్పించిన ఘట్టమనేని కుటుంబం, సినీ ప్రముఖులు..

నిన్న ఘట్టమనేని కుటుంబం కృష్ణ మొదటి వర్థంతిని(First Remembrance Day) హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Ghattamaneni Family Tributes to Krishna on his First Remembrance Day

Ghattamaneni Family Tributes to Krishna on his First Remembrance Day

సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) గత సంవత్సరం నవంబర్ 15న మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి, తల్లి, అన్నని కొన్ని రోజుల తేడాతోనే దూరం చేసుకొని మహేష్(Mahesh Babu) తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబంలో, టాలీవుడ్ లో, ఘట్టమనేని అభిమానుల్లో కూడా విషాదం నెలకొంది. అప్పుడే ఆయన మరణించి సంవత్సరం అయిపోయింది.

నిన్న ఘట్టమనేని కుటుంబం కృష్ణ మొదటి వర్థంతిని(First Remembrance Day) హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ స్మారక దినంకు ఘట్టమనేని కుటుంబం అంతా హాజరయ్యారు. అలాగే రాఘవేంద్ర రావు, రఘురామ కృష్ణంరాజు, వెంకయ్య నాయుడు.. ఇలా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వచ్చి కృష్ణకు నివాళులు అర్పించారు.

 

టాలీవుడ్, అభిమానులు మరోసారి కృష్ణని తలుచుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఈ స్మారక దినంలో మహేష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్‌కి షూటింగ్ లో ప్రమాదం జరిగిందా? లారీ మీద నుంచి కింద పడి..

  Last Updated: 16 Nov 2023, 06:51 AM IST