Site icon HashtagU Telugu

Ghantasala : ఘంటసాల బయోపిక్.. ఘంటసాలగా నటించేది ఎవరంటే.. రిలీజ్ ఎప్పుడంటే..?

Ghantasala Biopic Release Date Announced

Ghantasala

Ghantasala : దివంగత సంగీత దర్శకుడు, గాయకుడు ఘంటసాల ఎన్నో పాటలతో మనల్ని మెప్పించారు. పాత సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను మైమరిపించారు. ఇటీవల అనేకమంది గొప్పవాళ్ళ బయోపిక్స్ వస్తున్న నేపథ్యంలో ఘంటసాల బయోపిక్ కూడా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోయింది. తాజాగా ఘంటసాల బయోపిక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

ఘంటసాల బయోపిక్ ని CH రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో ఘంటసాలగా సింగర్ కృష్ణ చైతన్య నటించారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ నారాయణమూర్తి గెస్టులుగా వచ్చారు. ఘంటసాల సినిమాను 2025 ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఘంటసాల భారత రత్న అవార్డుకు అర్హుడు అని అన్నారు. మరి గానగంధర్వుడు ఘంటసాల బయోపిక్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Also Read : Pushpa 2 Peelings Song : పుష్ప 2 పీలింగ్స్ సాంగ్ వచ్చేసిందోచ్..!