ShahRukh Khan: భర్తతో సమానంగా కోట్లు సంపాదిస్తున్న గౌరీ.. ఆమె ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవడం ఖాయం?

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 11:30 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కాగా హీరో షారుక్ ఖాన్ కేవలం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు మాత్రమే కాదండోయ్ ప్రపంచంలో అత్యంత ధనిక నటులలో కూడా ఒకరు షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. టీవీరంగంలో తన నట జీవితాన్ని ప్రారంభించిన కింగ్ ఖాన్ నేడు కోట్లాది రూపాయలకు యజమాని. ఇటీవల విడుదల అయిన జవాన్, పఠాన్, షారుఖ్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి.

జీరో నుంచి కెరీర్ ప్రారంభించిన షారుక్ ఖాన్ కష్టపడి ఈరోజు ఈ స్థానానికి చేరుకున్నారు. అయితే షారుఖ్ మాత్రమే కాదు అతని లేడీ లవ్ అంటే అతని భార్య గౌరీ ఖాన్ కూడా తన భర్తలాగే ధనవంతురాలు అన్న విషయం చాలామందికి తెలియదు. గౌరీ ఖాన్ షారుక్ భార్యగా మాత్రమే కాకుండా ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా రాణిస్తున్నారు.ప్రస్తుతం గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. గౌరీ ఖాన్ ఇటీవల ముంబైలో టోరీ అనే లగ్జరీ రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆమె కూడా తన భర్త షారుక్ ఖాన్ మాదిరిగానే భారీగా సంపాదిస్తుంది. డిజైనర్ గానే కాకుండా గౌరీ ఖాన్ రెస్టారెంట్ వ్యాపారంలో కూడా స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చింది.

వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్, గౌరీ ఖాన్ ఇప్పుడు తన సొంత రెస్టారెంట్‌ను కూడా నడుపుతోంది. గౌరీ ఖాన్ తన కష్టార్జితంతో తన వ్యాపారాన్ని మొదలు పెట్టి నేడు విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది. గౌరీ ఖాన్ కూడా తన భర్త షారూఖ్ ఖాన్ లా కోట్లు సంపాదిస్తోంది. షారుక్ ఖాన్ లాగే ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా కోట్లాది సంపదకు యజమాని. ఆమె ఆస్తి విలువ మొత్తం 1725 కోట్ల రూపాయలు. షారుక్ ఖాన్ ఆస్తి విలువ మొత్తం 760 మిలియన్ డాలర్లు కాగా గౌరీ ఖాన్ ప్రతి సంవత్సరం దాదాపు 100 కోట్లు సంపాదిస్తోందట. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ.. పలువురు బాలీవుడ్ తారలతో పాటు వ్యాపారవేత్తలు, వీఐపీల ఇళ్లను అందంగా డిజైన్ చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్, అనన్య పాండే ,కరణ్ జోహార్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లను గౌరీ డిజైన్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఆమె ముఖేష్ అంబానీ, రాబర్టో కావల్లి, రాల్ఫ్ లారెన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల ఇళ్లను కూడా డిజైన్ చేసింది. అలాగే గౌరీ విజయవంతమైన నిర్మాత కూడా. ఇలా ఈ విషయంలో భర్తకు ఈక్వల్ గా ఉంటూ కోట్లు సంపాదిస్తోంది గౌరీ.