NTR కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్ టీ ఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు. సినిమా పై ఉన్న అంచనాలకు తగినట్టుగానే ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తున్నారు కొరటాల శివ. ఐతే ఈ సినిమాతో ఎలాగైనా బంపర్ హిట్ కొట్టాలని చూస్తున్న కొరటాల శివ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఎన్ టీ ఆర్ సినిమా అంటే అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ఉండాలి. ముఖ్యంగా డాన్స్ విషయంలో బ్లాక్ బస్టర్ అనిపిస్తాడు. అందుకే దేవర సాంగ్స్ తో కూడా అదుర్స్ అనిపించేలా చేస్తున్నారు.
దేవర సినిమాలో ఒక సాంగ్ ని గణేష్ ఆచార్య కంపోజ్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అని గణేష్ ఆచార్య (Ganesh Acharya) తెలుగు సినిమాల్లో కూడా కొన్ని సాంగ్స్ చేశారు. ఈమధ్యనే రిలీజైన పుష్ప 2 సూసేకి సాంగ్ ఆయన కంపోజింగ్ లోనే వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్ టీ ఆర్ దేవర లో కూడా ఒక అదిరిపోయే సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేస్తున్నాడట ఆచార్య గణేష్.
ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుందని అంటున్నారు. దేవర సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉంటే దాన్ని డబుల్ చేసేలా ఈ అప్డేట్స్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఇక సినిమా నుంచి రెండో సాంగ్ లవ్ సాంగ్ నేడు రిలీజ్ చేయనున్నారు. అనిరుద్ మ్యూజిక్ తో కూడా దేవర టాప్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఎన్ టీ ఆర్ దేవర సినిమా రెండు భాగాలుగా వస్తుంది. సెప్టెంబర్ 27న దేవర 1 వస్తుండగా పార్ట్ 2 నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లేదా 2026 లో వస్తుందని తెలుస్తుంది.
Also Read : Janhvi Kapoor : జాన్వి సెంటిమెంట్.. దేవర ఏం జరుగుతుంది..?