మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమాలపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ‘ఆర్ఆర్ఆర్'(RRR)తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఆయన సినిమా అంటే అభిమానుల్లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అటువంటి సమయంలో ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer)పై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. వాస్తవానికి చరణ్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ, కథాకథనాలు నిరాశ పరిచాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఫెయిల్యూర్ అయింది.
HYD : కూకట్ పల్లి లో దారుణం ..గంజాయి మత్తులో వ్యక్తి ప్రాణం తీశారు
ఈ సినిమా కలెక్షన్ల విషయంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. విడుదలకు ముందు పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసిన నిర్మాతలు కలెక్షన్లను వందల కోట్లుగా ప్రకటించగా, వాస్తవ వసూళ్లలో రూ.100 కోట్లకుపైగా తేడా కనిపించింది. దీనిపై సోషల్ మీడియాలో ‘ఫేక్ కలెక్షన్స్’ అంటూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ వచ్చింది. ఈ ఒత్తిడి నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కూడా ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్లు నిజంగా తక్కువేనని అంగీకరించాల్సి వచ్చింది. మొత్తంగా రూ.450 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, కేవలం రూ.195 కోట్లు మాత్రమే రాబట్టడం వలన భారీ నష్టాన్ని మిగిల్చింది.
Indian Army On Virat Kohli: టెస్టులకు విరాట్ గుడ్ బై.. స్పందించిన భారత డీజీఎంఏ!
ఇప్పటికే థియేటర్లలో ఘోర పరాజయం పాలైన ‘గేమ్ ఛేంజర్’, బుల్లితెరపై కూడా డిజాస్టర్ గా నిలిచింది. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 5.2 టీఆర్పీ మాత్రమే వచ్చిందట. ఇది స్టార్ హీరోల సినిమాల్లో చాలా తక్కువ రేటింగ్‌గా చెప్పుకోవాలి. గేమ్ ఛేంజర్ కంటే ‘పడమటి సంధ్యరాగం’ అనే సీరియల్‌కు కూడా ఎక్కువగా 5.78 టీఆర్పీ వచ్చినట్లు సమాచారం. ఈ టీఆర్పీ వివరాలు రామ్ చరణ్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి.