Game Changer Trailer: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నుంచి మేకర్స్ ఓ బిగ్ అప్టేట్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను (Game Changer Trailer) జనవరి 2వ తేదీన సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అంతేకాకుండా ఇంకా ఆట మొదలు అనే క్యాప్షన్‌ను ట్వీట్‌లో పేర్కొంది. మూవీ విడుదల చేసిన ఈ పోస్ట్‌లో రామ్ చరణ్ తెల్ల, లుంగీ పంచె కట్టుకుని యాంగ్రీ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను డల్లాస్‌లో నిర్వహించిన చిత్ర యూనిట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. విజయవాడ లేదా రాజమండ్రిలో గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది.
Also Read: Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
A blockbuster start to the year already! #GameChangerTrailer drops on 2.01.2025!❤️🔥😎
Let The Games Begin 💥❤️🔥#GameChanger #GameChangerOnJanuary10 pic.twitter.com/jvJeemY9Dd
— Game Changer (@GameChangerOffl) January 1, 2025
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ని తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీని భారీ స్థాయిలో దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, స్టిల్స్ అన్ని మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్‌గా కియరా అద్వానీ, నటులు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, బ్రహ్మానందం, అలీ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చరణ్ నటించిన చివరి చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే గేమ్ ఛేంజర్‌పై కూడా అభిమానులు భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో (ఆర్‌సీ 16) నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు రామ్ చరణ్.