‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పై రామ్ చరణ్ (Ram Charan) అభిమానుల్లోనూ, తెలుగు చిత్రసీమలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రామ్ చరణ్ పాత్రను ఆయన గత చిత్రాల కంటే పూర్తిగా కొత్తగా, విభిన్నంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇందులో చరణ్ లీడ్ రోల్ లో ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో దీపావళి కానుకగా సినిమా తాలూకా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శంకర్ తన సినిమాల్లో చూపే భవిష్యత్ దృశ్యాలు, సాంకేతిక విలువల దృష్ట్యా, ఈ టీజర్‌లోని విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చని అంచనా. అలాగే, ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్‌లో ఆయన సంగీతం కూడా కీలకంగా ఉండబోతుందని వినికిడి. సీనియర్ నటులు శ్రీకాంత్, ఎసీ సూర్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్.
Read Also : Rave Party : జన్వాడ రేవ్ పార్టీపై కేటీఆర్ సమాధానం చెప్పాలి – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్