Site icon HashtagU Telugu

Game Changer : డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్..?

Game Changer

Game Changer

డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అవుతుండడం..ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోవడం తో ఫ్యాన్స్ మేకర్స్ ఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వినాయకచవితి నుండి వరుసగా సినిమా తాలూకా అప్డేట్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ మూవీ ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్లు సమాచారం. వినాయక చవితి పండగ రోజున విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే శంకర్ ‘భారతీయుడు 2’ సగం పూర్తి చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మొదలైన కొద్ది నెలలకు మిగిలిన సినిమా కంప్లీట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నారు. అలా ‘గేమ్ ఛేంజర్‌’కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా సినిమా పూర్తి కావడానికి కాస్త ఆలస్యం అయింది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారని సమాచారం. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్​జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.

Read Also : Kashmir Elections : బీజేపీతో పొత్తుపై మెహబూబా ముఫ్తీ కీలక ప్రకటన