‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పై మెగా (Mega Fans) అభిమానుల్లో, తెలుగు చిత్రసీమలో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. రామ్ చరణ్ (Ramcharan) పాత్రను ఆయన గత చిత్రాల కంటే పూర్తిగా కొత్తగా, విభిన్నంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇందులో చరణ్ లీడ్ రోల్ లో ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మేకర్స్ సినిమా ప్రమోషన్లపై దృష్టి సారించారు. మొదటి నుండి ప్రమోషన్లు సరిగా చేయడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉండగా..ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో వరుస అప్డేట్స్ , ఈవెంట్స్ తో సందడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release ) ను గ్రాండ్ గా నిర్వ్హయించేందుకు ప్లాన్ చేసారు. జనవరి 4న ఈ వేడుక జరపబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (APdeputycm Pawankalayn) చీఫ్ గెస్ట్ గా వస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్. ఇక ఈ మూవీ లో సీనియర్ నటులు శ్రీకాంత్, ఎసీ సూర్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుంది. దిల్ రాజు ప్రొడ్యూసర్.
Read Also : Cyclone Fengal Updates: తీవ్ర వాయుగుండం.. మరో 12 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం!