Site icon HashtagU Telugu

Game Changer Pre Release Event : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ పవన్ కల్యాణే – దిల్ రాజు

Game Changer Pre Release Ev

Game Changer Pre Release Ev

గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release) కు చీఫ్ గెస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే (Pawan Kalyan Chief Guest) అని నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలిపి అభిమానుల్లో జోష్ నింపారు. శంకర్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న భారీ ఎత్తున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమా పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. ఈరోజు విజయవాడలో చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిల్ రాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముందుగా చరణ్ ఫ్యాన్స్ ను అభినందించారు. ఈరోజు తాను విజయవాడ వచ్చింది రామ్ చరణ్ కటౌట్ కార్యక్రమం కోసమే కాకుండా, మరో పని మీదనే కాదు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడానికి కూడా వచ్చానని చెప్పుకొచ్చారు. అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అందరూ చూశారని, ఇక పవన్ కల్యాణ్ హాజరయ్యే ఈవెంట్ ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోవాలని అన్నారు. దాని గురించి మాట్లాడ్డానికి వచ్చానని దిల్ రాజు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ గారు ఇచ్చే డేట్ ను బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్ ఎక్కడ జరపాలనేది ప్లాన్ చేసుకుంటామని తెలిపారు. కల్యాణ్ గారు హాజరయ్యే ఆ ఈవెంట్ మామూలుగా ఉండకూడదు. ఆ ఈవెంట్ తో ఒక చరిత్ర క్రియేట్ చేయాలి అంటూ అభిమానులకు సూచించాడు.

Read Also : Komatireddy Venkat Reddy : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి