Site icon HashtagU Telugu

Game Changer Censor Cuts : ‘గేమ్ ఛేంజర్’ సెన్సార్ కట్స్ ఇవే..!

Game Changer Censor

Game Changer Censor

గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్..గేమ్ ఛేంజర్ (Game Changer ) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా మారుమోగుతున్న పేరు. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram Charan)..గేమ్ చేంజర్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బరిలోకి దిగుతుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా..శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌‌తో నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జనవరి 10 న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

YCP Comments : ‘కక్షే’ ఉంటె జగన్ ఇంతసేపా..? – చంద్రబాబు

ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకుని.. విడుదలకు అన్ని విధాలా సిద్ధమైంది. ఈ క్రమంలో సెన్సార్ నుండి ఈ సినిమాకు ఎదురైనా అభ్యంతరాలు..? రన్ టైం ఎంత..? సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి..? అనేది తెలుసుకునేందుకు అభిమానులు ఆత్రుత కనపరుస్తున్నారు. ఈ సందర్బంగా వారి ఆతృతను తెరదించే ప్రయత్నం చేస్తున్నాం. సెన్సార్ విధించిన కట్స్ అన్నీ పోనూ ఈ సినిమా 165 నిమిషాల 30 సెకన్లుగా ఫైనల్ అయ్యింది. అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెన్సార్ నుండి ఈ సినిమాకు వచ్చిన కట్స్ చూస్తే..కొన్ని వర్డ్స్‌ని రీప్లేస్ చేయాలని మాత్రమే సెన్సార్ టీమ్ సూచించింది తప్పితే పెద్దగా కట్స్ ఏమి చెప్పలేదు.

1. టైటిల్‌ కార్డును తెలుగులో కూడా ప్రదర్శించాలి.

2. మద్యానికి సంబంధించిన లేబుల్స్‌ని తీసేయాలని ఆదేశించగా.. వాటిని సీజీతో కవర్ చేశారు.

3. సినిమాలో 3, 4 సార్లు వచ్చే ‘చట్టప్రకారం’ అనే వర్డ్‌ తొలగించాలి. అలాగే ‘కేరళ’ అనే పదాన్ని, అందుకు సంబంధించిన సబ్ టైటిల్‌ని తొలగించాలని సెన్సార్ టీమ్ ఆదేశించగా… చట్టప్రకారం అనే వర్డ్ ప్లేస్‌లో ‘లెక్క ప్రకారం’ అనే వర్డ్‌ని రీప్లేస్ చేశారు. కేరళ అనే పదాన్ని పూర్తిగా తొలగించారు.

4. దుర్గ శక్తి నాగ్‌పాల్ అనే పేపర్ కటింగ్‌ని తొలగించాలని ఆదేశించగా.. ఆ ప్లేస్‌‌ను ‘సుచిత్రా పాండే’‌తో రీప్లేస్ చేశారు.

5. టైటిల్ కార్డ్స్‌లో ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ టైటిల్‌లోని ‘పద్మశ్రీ’ని తొలగించాలని ఆదేశించగా.. టీమ్ దానిని తొలగించింది. ఇవి మాత్రమే సూచించి, ఈ సినిమాకు ‘యు/ఏ’ సర్టిఫికేట్‌ని సెన్సార్ టీమ్ జారీ చేసింది.

Liquor Sales Record : తెలంగాణ సర్కార్ కు ‘కిక్’ ఇచ్చిన న్యూ ఇయర్