ప్రముఖ నిర్మాత, FDC ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఏప్రిల్‌లో గద్దర్ అవార్డులు (Gaddar Awards) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల నుంచి ప్రతి ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, ఉత్తమ చిత్రాలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు మరింత కీలకంగా మారనున్నాయని ఆయన వివరించారు.
MSK Prasad : వోక్సెన్ విశ్వవిద్యాలయంతో మాజీ క్రికెటర్ అవగాహన ఒప్పందం
2024లో విడుదలైన సినిమాలకు అవార్డుల ప్రక్రియలో కొన్ని మార్పులు చేస్తామని దిల్ రాజు తెలిపారు. పాత తరహాలోనే అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే గతంలో లాగానే సాంకేతిక నిపుణులు, నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకులు ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వివరించారు.
ఈ అవార్డులను తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు పైడి జయరాజ్, కాంతారావు పేరుతో అందించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు వారు అందించిన సేవలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు, ఉత్తమ చిత్రాలను గుర్తించి మరింత ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఉపయోగపడతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.