Samantha: పొట్టి నిక్కరుతో స్యామ్ రచ్చ మామూలుగా లేదుకదా…!!

సమంత...పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. అయినా తన హవా ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఏ మాయ చేశావే సినిమా నుంచి అందర్నీ మాయాలో పడేసింది ఈ భామ.

  • Written By:
  • Publish Date - February 20, 2022 / 01:34 PM IST

సమంత…పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. అయినా తన హవా ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఏ మాయ చేశావే సినిమా నుంచి అందర్నీ మాయాలో పడేసింది ఈ భామ. కేవలం అందమే కాదు…అద్బుతమైన నటన ఈ బ్యూటీ సొంతం. వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది స్యామ్. తమిళ్ లోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్ లో సత్తా చాటుతోంది.

అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సమంతకు…డైవర్స్ తర్వాత పూర్తిగా ఫ్రీడమ్ లభించింది. తనకు నచ్చినట్లుగా ఉంటోంది. ఈ మధ్యే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సమంత పాన్ ఇండియాలో లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న శాకుంతలం అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ రొమాంటిక్ డ్రామాను మూవీని గుణశేఖర్ టీం వర్క్స్ బ్యానర్ పై నీలిమా నిర్మిస్తున్నారు. దీంతోపాటుగా విఘ్నేష్ శివన్ నిర్మిస్తోన్న కాతు వాకుల్ రెండు కాదల్ అనే తమిళ్ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది. ఈ రెండు మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇక రీసెంట్ గా బెఫ్టా అవార్డు గ్రహీత ఫిలిప్ జాన్ నిర్మిస్తున్న ఈ వెబ్ ఫిల్మ్ లోనూ సమంత యాక్ట్ చేస్తుంది. వీటితోపాటు యశోద అనే పాన్ ఇండియా మూవీలోనూ మెయిన్ రోల్లో నటిస్తోంది.

ఇలా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే…సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ మ్యాటర్స్ తోపాటుగా మూవీ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. లేటెస్టుగా సమంత ఓ జలపాతం దగ్గర పొట్టి నిక్కరు వేసుకుని దిగి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రకృతి అందాలను చూపిస్తూ స్యామ్ ఈ ఫోటోల్లో కనిపించింది.