#BoyapatiRAPO: రామ్ మాస్ జాతర.. దుమ్మురేపిన బోయపాటి ఫస్ట్ థండర్!

మాస్ డైరెక్టర్ తో పనిచేస్తున్న ఉస్తాద్ రామ్ (Ram) ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - May 15, 2023 / 12:22 PM IST

బోయపాటి (Boyapati) అంటే మాస్.. మాస్ అంటే బోయపాటి. అందుకే డైరెక్టర్ బోయపాటితో ఒక్క సినిమా అయినా చేయాలని టాలీవుడ్ స్టార్స్ బలంగా కోరుకుంటారు. బోయపాటి మాస్ అప్పీల్ తోనే నందమూరి బాలయ్య వరుస హిట్స్ కొడుతున్నారంటే ఆ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక హీరోలను మాస్ లుక్స్ లో బోయపాటి చూపించనంతా మరే డైరెక్టర్ కు సాధ్యం కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో యంగ్ హీరో రామ్, బోయపాటి కాంబినేషన్ లో రూపుద్దిదుకుంటున్న మూవీ ఆసక్తిని రేపుతోంది. మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో రామ్ కనిపించాడు.

మాస్ డైరెక్టర్ తో పనిచేస్తున్న ఉస్తాద్ రామ్ (Ram) ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్ర నిర్మాతలు ఫస్ట్ థండర్ పేరుతో (First Thunder) ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి, గంగిరెద్దులు అందంగా అలంకరించబడిన గేదెల కార్నివాల్‌లో ఉత్కంఠభరితమైన ఫైట్ ఎపిసోడ్‌ని చూపించాడు. రామ్ మృగంలా కనిపించాడు. ఆయన మాస్ గెటప్ కచ్చితంగా అభిమానులను మెప్పిస్తుంది. ఇక జాతరలోని ఫైట్ సీక్వెన్స్ ఊర మాస్. “నీ రాష్ట్రం దాటలేనన్నావ్ దాటా, నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్స్ ను దాతలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్”  అంటూ రామ్ చెప్పే డైలాగ్ ఉత్కంఠత రేపుతోంది. ఇక హీరోయిన్ శ్రీలీల రామ్ ఉరుములు చూసి షాక్ అవుతుంది.

బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ (BoyapatiRAPO) కి సంతోష్ డిటాకే కెమెరామెన్ వర్క్ చేశారు. థమన్ తన అద్భుతమైన BGM, RAPO శ్లోకంతో అదనపు ఉరుములతో దుమ్మురేపాడు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, అత్యున్నత సాంకేతిక అంశాలతో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్వారా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రం దసరా కోసం పాన్ ఇండియా లెవల్లో అక్టోబర్ 20న విడుదల కానుంది.

Also Read: Amitabh Bachchan: ట్రాఫిక్ తో బిగ్ బీ బేజార్.. అమితాబ్ టైమింగ్ కు నెటిజన్స్ ఫిదా!