Nawab : ‘నవాబ్’ చిత్రం ఫస్ట్ లుక్..

హరిహర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్ఎం నిర్మాణ సారథ్యంలో రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం 'నవాబ్' (Nawab).

Published By: HashtagU Telugu Desk
Nawab

First Look Of Ravi Charan's Thrilling Pan India Film, 'nawab' Is Revealed Telugu

Nawab First-Look : హరిహర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్ఎం నిర్మాణ సారథ్యంలో రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘నవాబ్‘. ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ ను చూడగానే ఒక మాస్సివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. రా అండ్ రస్టిక్ లుక్ తో, ముందు డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో ఇంటెన్సివ్ గా సిగర్ తాగుతున్న హీరో పోస్టర్ కచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తూ.. చూడగానే ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రం ఒక డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ అని, ఆధ్యాంతం ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకుడికి ‘నవాబ్’ (Nawab) చిత్రం అందిస్తుందని మేకర్స్ తెలిపారు. యాక్షన్ డ్రామాతో పాటు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో కీలకమని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ‘నవాబ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని, త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేసుకుంటుందని వీలైనంత త్వరగా మూవీ విడుదలకు సంబంధించిన ప్రకటనను వెల్లడించే అవకాశం ఉందని మేకర్స్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రేక్షక ఆధరణతో పాటు విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న ‘నల్లమల’ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రవి చరణ్ తన రెండవ చిత్రం అయిన ‘నవాబ్’ (Nawab) మూవీకి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే నవాబ్ చిత్రానికి స్టైలిస్ట్ గా శోభారాణి పనిచేశారు. చిత్ర నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నవాబ్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘నవాబ్’ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ను మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు.

నటీనటులు: ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల, మురళి శర్మ, దేవిప్రసాద్, శివపుత్రుడు రామరాజు, రాహుల్ దేవ్, శ్రవాణ్ రాఘవేంద్ర, పాయల్ ముఖర్జీ, స్నేహా గుప్త, రావి పల్లి సంధ్యరాణి, ప్రియా, శరత్ బరిగెల, సాగర్ ఎనుగల, మల్లేడి రవి, అరున్ కుమార్, సంజయ్ రాయుచురి, శ్రీ సుధా, కృష్ణేశ్వర రావు, టార్జాన్, కోటేశ్వరరావు, డబ్బింగ్ జానకి, మని భమ్మ, సమ్మెట గాంధీ, మేక రామకృష్ణ, సునీత మనోహర్, పింగ్ పాంగ్ సూర్య, జెమిని సురేష్, దయానంద రెడ్డి, అప్పాజీ, దీపక్ సూర్య, యోగి కాత్రి తదితరులు.

బ్యానర్: హరిహర క్రియేషన్స్
రచనా దర్శకత్వం: రవి చరణ్
నిర్మాత: ఆర్ ఎమ్
మ్యూజిక్ డైరెక్టర్: పీఆర్
సినిమాటోగ్రఫర్: రమేష్ కేఆర్
ఎడిటర్: శివ సర్వని
కొరియోగ్రఫర్: ప్రేమ్ రక్షిత్
వీఎఫ్ఎక్స్: రాఘవ
స్టంట్స్: నవకాంత్
స్టైలిస్ట్: శోభారాణి
పీఆర్ఓ : హరీష్, దినేష్

Also Read:  Pooja Hegde Bikini : మరోసారి బికినీ తో నిద్ర లేకుండా చేసిన పూజా హగ్దే

  Last Updated: 16 Oct 2023, 01:13 PM IST