Snoring Husbands: మరో సరికొత్త ‘పూరి మ్యూజింగ్స్’తో దర్శకుడు పూరి జగన్నాథ్ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో ‘స్లీప్ డివోర్స్’ గురించి ఆయన వివరించారు. దానితో ముడిపడిన కీలక విషయాలను చెప్పారు. అవేంటో చూద్దాం..
Also Read :All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్
స్లీప్ డివోర్స్ ?
స్లీప్ డివోర్స్ అంటే భార్య,భర్త కలిసి ఒక ఇంట్లో ఉంటున్నా.. వేర్వేరు గదుల్లో నిద్రపోవడం. సుఖవంతమైన నిద్ర కోసం భార్య,భర్త ఇద్దరూ ఈవిధంగా విడివిడిగా ఉంటున్నారు. ఇలా నిద్రపోయినంత మాత్రాన ఇద్దరూ విడిపోయినట్టుగా భావించకూడదని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. దాంపత్య జీవితంలో అదొక చిన్న అడ్జస్ట్‌మెంట్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. స్లీప్ డివోర్స్ వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే దంపతులు కలకాలం హ్యాపీగా ఉండగలుగుతారని పూరి జగన్నాథ్(Snoring Husbands) తెలిపారు.
Also Read :Deputy CM Bhatti : నల్లమల డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతాం.. రాజీవ్ యువ వికాసానికి వెయ్యి కోట్లు : భట్టి
రాత్రివేళల్లో ఫుల్ క్లారిటీ
పూరి జగన్నాథ్ కథనం ప్రకారం.. విడాకులు అంటే కోర్టుల్లో లీగల్‌గా తీసుకునేవి. స్లీప్ డివోర్స్ అంటే అలాంటివి కాదు. లీగల్‌గా తీసుకునే విడాకులు మొత్తం జీవితానికి వర్తిస్తాయి. స్లీప్ డివోర్స్‌లో భాగంగా భార్యాభర్తలు కలిసి తీసుకునే నిర్ణయం లిమిట్స్ అనేవి.. ఇల్లు, బెడ్ రూమ్ వరకే పరిమితం అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో ఒకటికి మించి గదులున్న ఇళ్లలో.. భార్యాభర్తలు వేర్వేరు గదుల్లో నిద్రపోతారు. చిన్నసైజు ఇళ్లలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అయిపోతారు. స్లీప్ డివోర్స్ తీసుకుంటే.. ఇద్దరి మధ్య చికాకులు, చిరాకులు తగ్గిపోతాయి. క్లారిటీతో రాత్రులను ముందుకు తీసుకెళ్తారు అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.
టీవీ రిమోట్ నుంచి సీరియల్ చూసే దాకా..
‘‘టీవీ రిమోట్ కోసం కొందరు భార్యాభర్తలు గొడవ పడుతుంటారు. ఒకరు మొబైల్ చూస్తుంటే మరొకరు నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. ఒకరు స్పోర్ట్స్ ఛానల్ చూస్తానంటే, మరొకరు సీరియల్ చూస్తానంటారు. ఒకరు ఏసీ వేసుకుంటే, మరొకరు ఫ్యాన్ వేసుకుంటా అంటారు. ఇవన్నీ జరిగితే ఆ రాత్రి ఇద్దరి నిద్ర నాశనమైపోతుంది. ఈ పరిస్థితులు ఎదురు కావొద్దంటే స్లీప్ డివోర్స్ బాగా పనిచేస్తాయి’’ అని పూరి జగన్నాథ్ తెలిపారు. ‘‘స్లీప్ డివోర్స్ తీసుకున్నాక మంచినిద్ర పడుతుంది. వేర్వేరు గదుల్లో పడుకుంటే బంధం మరింత బలపడుతుంది. బాగా నిద్రపోతే మరుసటి రోజు మూడ్ బాగుంటుంది. బాగా పనిచేయగలుగుతారు. సెక్స్ లైఫ్ కూడా బాగుంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. మ్యారేజ్ డివోర్స్ దాకా వెళ్లొద్దని భావించేవారు.. స్లీప్ డివోర్స్‌ను పాటించడం బెటర్ అని పూరి జగన్నాథ్ సూచించారు.