Site icon HashtagU Telugu

Akkineni Akhil : అఖిల్ చాయిస్ పై ఫ్యాన్స్ అసంతృప్తి..!

Fans Upset With Akkineni Ak

Fans Upset With Akkineni Ak

Akkineni Akhil ఏజెంట్ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే యువి క్రియేషన్స్ బ్యానర్ లో నూతన దర్సకుడితో ఒక సినిమా ప్లానింగ్ తో ఉందని టాక్ వచ్చింది. పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అన్నారు. కానీ లేటెస్ట్ గా అఖిల్ ఆ సినిమా కన్నా ముందు తమిళ దర్శకుడితో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. అది కూడా అసలేమాత్రం ఫాం లో లేని ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా అనేసరికి అక్కినేని ఫ్యాన్స్ లో మళ్లీ టెన్షన్ పట్టుకుంది.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం అఖిల్ (Akkineni Akhil) తమిళ దర్శకుడు లింగుసామి డైరెక్షన్ లో సినిమా చేసే ఆలోచన ఉన్నాడని అంటున్నారు. కోలీవుడ్ లో ఫాం లో లేని లింగుసామి చివరగా రాం తో చేసిన ది వారియర్ కూడా ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి టైం లో అఖిల్ ఏ ధైర్యంతో లింగుసామితో సినిమా చేయాలని అనుకుంటున్నాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

అఖిల్ లింగుసామి ఈసారి టార్గెట్ మిస్ అవకుండా సినిమా చేయాలని అనుకుంటున్నరట. అఫిషియల్ అప్డేట్ వచ్చే దాకా వెయిట్ చేయాలని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేశాడు. ఆ సినిమా కూడా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. మరి లింగుసామి సినిమాతో అయినా అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఒకప్పుడు కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన లింగుసామి ఇప్పుడు అక్కడ కూడా ఫాం కోల్పోయాడు. ది వారియర్ సినిమా తమిళ ఆడియన్స్ ని కూడా మెప్పించలేదు. అఖిల్ తో సినిమా కూడా తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీగా చేయాలని చూస్తున్నాడు అఖిల్.

Also Read : Prudhvi Raj : ఎన్టీఆర్ ని అలా పిలిస్తే నచ్చదంటున్న పృథ్వి..!