Site icon HashtagU Telugu

Salaar : హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం..

Salaar Movie Pre Release Business Details

Salaar Movie Pre Release Business Details

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ (Salaar) మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ను ప్రభాస్ కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో అందరి దృష్టి సలార్ పైనే ఉంది. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం..ట్రైలర్ సైతం ఆకట్టుకోవడం తో సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films ) సంస్థ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ కు సంబదించిన ప్రమోషన్ పెద్దగా చేయడంలేదు. ఇంతవరకు ప్రభాస్ పబ్లిక్ గా బయటకు వచ్చి సినిమా విశేషాలు చెప్పింది లేదు..పోనీ సోషల్ మీడియా లోనైనా హోంబలే ఫిల్మ్స్ సంస్థ వారు సినిమాకు సంబదించిన అప్డేట్స్ ఇవ్వకుండా తమ సంస్థలో రాబోయే చిత్రాలకు సంబదించిన అప్డేట్స్ ఇస్తుండడం తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవలే భగీర టీజర్ ని రిలీజ్ చేసారు హోంబలే ఫిల్మ్స్. సరేలే ఆ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే కదా అనుకుంటే కొత్తగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘రఘు తాత’ సినిమా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఎలాంటి అకేషన్ లేదు, షూటింగ్ కంప్లీట్ కూడా ఎప్పుడో అయిపొయింది, డబ్బింగ్ స్టార్ట్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వలేదు… ఇలా అసలు ఎలాంటి అకేషన్ లేకుండా సడన్ గా ఇప్పుడు రఘుతాత త్వరలో రిలీజ్ అవ్వబోతుంది అంటూ హోంబలే ఫిల్మ్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న నెక్స్ట్ సినిమా రఘుతాత త్వరలో రిలీజ్ కాబోతుంది అంటూ ట్వీట్ వచ్చింది. రిలీజ్ డేట్ అయినా చెప్పకుండా త్వరలో రిలీజ్ అవుతుంది అంటూ రఘుతాత అప్డేట్ ని ఎందుకు ఇచ్చారో హోంబలే ఫిల్మ్స్ కే తెలియాలి. ఇలా వరుసగా వారి సినిమాల తాలూకా అప్డేట్స్ ఇస్తున్నారు తప్ప సలార్ మూవీ కి సంబదించిన పోస్టర్స్ కానీ, మేకింగ్ వీడియోస్ , ఇంటర్వూస్ ఇలా ఏది ఇవ్వడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు