Salaar : సలార్ A సర్టిఫికెట్ ఎంత పని చేసింది..!

Salaar రెబల్ స్టార్ నటించిన ప్రభాస్ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్. సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని చిత్ర యూనిట్ పెద్దగా ఫీల్ అవ్వలేదు

Published By: HashtagU Telugu Desk
Salaar 3 Days

Salaar 3 Days

Salaar రెబల్ స్టార్ నటించిన ప్రభాస్ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్. సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని చిత్ర యూనిట్ పెద్దగా ఫీల్ అవ్వలేదు. కానీ ఆ సర్టిఫికెట్ వల్ల సినిమా చూడలేకపోతున్నామని చాలమంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి సలార్ కి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకుంటే తీరా అక్కడకి వెళ్తే ఇది A సర్టిఫికెట్ సినిమా అని.. పిల్లలకు నో ఎంట్రీ అని చెప్పేస్తున్నారు.

రీసెంట్ గా హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో ఒక ప్రభాస్ అభిమాని ఫ్యామిలీతో సినిమాకు వెళ్లి అక్కడ తమ పిల్లలకు నో ఎంట్రీ అని చెప్పగానే చేసిన హడావిడి తెలిసిందే. అదేంటి ఇదివరకు A సర్టిఫికెట్ సినిమాలకు పిల్లలను రానిచ్చారు కదా అంటే. సినిమా రిలీజైతే పొలోమని వెళ్లడమే తప్ప ఎప్పుడైనా సెన్సార్ సర్టిఫికెట్ గురించి తెలుసుకునే ఛాన్స్ లేదుగా.

Also Read : Venkatesh : వెంకటేష్ కోసం వాళ్లంతా వస్తున్నారా..?

కొన్ని సినిమాలకు U/A సర్టిఫికెట్ ఇస్తారు. అలా ఇచ్చిన సినిమాలకు పిల్లలు వచ్చినా ఏమి కాదు. కానీ A సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు పిల్లలను తీసుకెళ్లనివ్వరు. ఈమధ్య కేంద్ర ప్రభుత్వం ఈ విధివిధానాలను కట్టుదిట్టం చేయడంతో థియేటర్ యాజమాన్యం కూడా A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు పిల్లలకు నో ఎంట్రీ అని స్ట్రిక్ట్ గా ఉంటున్నారు.

ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలా ఫ్యామిలీ మొత్తం చూసేందుకు వీలు కుదరకపోవడం కూడా ఒక ఇబ్బందే అని చెప్పొచ్చు. ప్రభాస్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా ఫ్యాన్స్ మాత్రం సలార్ పై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 26 Dec 2023, 02:11 PM IST