పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో కల్ట్ క్లాసిక్స్ గా గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో ఖుషి ఒకటి. అతడికి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిన మూవీ అది. తాజాగా రీ-రిలీజ్ అయిన ఆ సినిమా దుమ్మురేపింది. రెగ్యులర్ సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లు తెచ్చిపెట్టింది. ఇప్పుడు పవన్ (Pawan Kalyan) నుంచి మరో కల్ట్ క్లాసిక్ రాబోతోంది. పవన్ కల్యాణ్ కు ఎంతో ఇష్టమైన తొలిప్రేమ (Tholiprema) సినిమా కూడా రి-రిలీజ్ కు రెడీ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరిలో ఈ సినిమాను థియేటర్లలోకి మరోసారి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాను హెడ్ డీ ఫార్మాట్ లోకి మార్చడం, ఆడియోను డాల్బీ సిస్టమ్ లోకి ఎక్కించడం లాంటి పనులు సాగుతున్నాయి. అవన్నీ పూర్తయిన వెంటనే తొలిప్రేమ రీ-రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. పవన్-కీర్తిరెడ్డి (Pawan Kalyan) హీరోహీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాకంటూ ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఇలాంటి సినిమా థియేటర్లలోకి వస్తే మరోసారి ఎంజాయ్ చేసేందుకు చాలామంది రెడీ. కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకుడు.
Also Read : Tamannaah and Vijay Varma: బాలీవుడ్ నటుడితో మిల్కీ బ్యూటీ డేటింగ్.. కిస్సింగ్ వీడియో వైరల్