Site icon HashtagU Telugu

Shakila – Bigg Boss 7 : ‘బిగ్ బాస్’ హౌస్ లోకి షకీల.. ఇంకా లిస్టులో ఉన్నదెవరంటే.. ?

Shakila Bigg Boss 7

Shakila Bigg Boss 7

Shakila – Bigg Boss 7 : ‘బిగ్ బాస్ సీజన్ 7’  రియాల్టీ షో సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. అయితే ‘బిగ్ బాస్’ నాగార్జున హౌస్  లోకి వెళ్లే కంటెస్టెంట్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ షోలో పాల్గొనబోతున్న వారిలో ప్రముఖ  నటి షకీలా కూడా ఉన్నారనే టాక్ వినవస్తోంది. ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అమర్ దీప్ కు ఈసారి షోలో పాల్గొనే ఛాన్స్ దక్కబోతోందని తెలుస్తోంది. ఆయనకు కాబోయే భార్య కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘కార్తీకదీపం’  సీరియల్లో మోనిత పాత్ర చేసిన నటి శోభా శెట్టి కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే (Shakila – Bigg Boss 7) అంచనాలు వెలువడుతున్నాయి.

Also read : Ruhani Sharma Bikini : బికినీ లో సెగలు రేపుతున్న రుహాని శర్మ

‘మొగలి రేకులు’ సీరియల్ ఫేమ్ సాగర్, ‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి ప్రియాంక జైన్, సీరియల్ నటి పూజా మూర్తి, అంజలి పవన్, డాన్స్ మాస్టర్ ఆట సందీప్, ప్రముఖ యూట్యూబర్ అనిల్ గీల, రంగస్థలం మహేష్, సీతల్ గౌతమన్, పల్లవి ప్రశాంత్, జబర్దస్త్ కమెడియన్స్ బుల్లెట్ భాస్కర్, రియాజ్, తేజ, న్యూస్ యాంకర్ ప్రత్యూష, హీరో గౌతమ్ కృష్ణ, యాక్టర్ క్రాంతి, సింగర్ దామిని, అన్షు, మోడల్ యవార్ కూడా బిగ్ బాస్ సీజన్ 7 లిస్టులో ఉన్నారని సమాచారం. మొత్తం మీద 20 మంది ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు. హీరో అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా కూడా ఈసారి నాగార్జునకు అతిథులుగా రాబోతున్నారని పలువురు చెబుతున్నారు.  అయితే వీరి రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటిదాకా వెలువడలేదు.

Also read : Hyderabad: రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వర్షాలు