ప్రముఖ హాస్యనటుడు మనోబాల (Manobala) కన్నుమూశారు. గత కొన్నాళ్ల నుంచి కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నిరోజుల ఆస్పత్రిలో చేరారు. తాజాగా పరిస్థిత విషమించడంతో బుధవారం కన్నుమూశారు. దాదాపుగా 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
తమిళనాడులోని (Tamilnadu) మరుంగూర్ లో పుట్టిన మనోబాల, కమల్ హాసన్ రిఫరెన్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు. 1979లో భారతీరాజా తీసిన ‘పుతియా వార్పుగళ్’ మూవీతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు. అదే మూవీలో పంచాయతీ సభ్యుడిగానూ చిన్న రోల్ లో కనిపించారు. అక్కడ నుంచి మొదలుపెడితే 20కి పైగా సినిమాలకు డైరెక్షన్ చేశారు. 250-300 సినిమాలు చేసిన ఈయన.. తెలుగులో చివరగా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో నటించారు. ఆయన మరణంతో అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్య, ఆసిన్ కాంబినేషన్ లో వచ్చిన గజిని మూవీలో ఆయన పండించిన హాస్యం ఎవరు మరిచిపోలేరు.
Also Read: Shah Rukh Khan: షారుక్ ఖాన్ కు కోపం వస్తే అంతే మరి!