Samantha Reveals: ఐటెం సాంగ్ చేయొద్దని ఆంక్షలు విధించారు: సమంత షాకింగ్ కామెంట్స్

ఊ అంటావా సాంగ్ అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లోనూ దుమ్మురేపింది.

  • Written By:
  • Updated On - March 29, 2023 / 10:59 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, నేషనల్ క్రష్ రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఊ అంటావా సాంగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమంత సెక్సీ డాన్స్.. మైమరిపించే మ్యూజిక్ కు అభిమానులకు ఫిదా అయ్యారు. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లోనూ దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటి సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు.

“ఊ అంటావా ఊ ఊ అంటావా” సమంత (Samantha) నటనకు ప్రశంసలు అందుకుంది. కానీ సమంత తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన వెంటనే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ పాటను చేయొద్దని కోరారు. అక్కినేని ఫ్యామిలీ కూడా వల్గారిటీకి దూరంగా ఉండాలని కూడా పెళ్లి సమయంలోనే చెప్పింది. అయితే నాగచైతన్య తో విడిపోయిన తర్వాత పుష్ప ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చింది. తాను ఏ తప్పు చేయనందున ఇంట్లో ఎందుకు కూర్చోవాలని, నేరం చేసినట్టు ఇంట్లో ఎందుకు దాక్కోవాలి అని సమంత తనకు తాను ప్రశ్నించుకుంది. ఇంట్లో ఖాళీగా కూర్చునే మూడ్ లేక ‘ ఊ అంటావా’ పాటలో నటించాల్సి వచ్చిందని తెలిపింది. నేను చైతన్యతో విడిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఐటెం సాంగ్ చేయొద్దని చెప్పారు. కానీ నేనూ ఏ తప్పు చేయలేదు కాబట్టే ఐటెం సాంగ్ చేశాను అని చెప్పింది.

ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడే నేనెందుకు దాక్కోవాలి అని అప్పుడే అనుకున్నాను (Samantha), నేనేమీ తప్పు చేయలేదు. పెళ్లి బాధ్యతలను 100 శాతం సమర్థవంతంగా నిర్వహించాను. కానీ, చేయని పనికి నన్ను తప్పుపట్టడం సరికాదు అని సమంత పలు విషయాలను షేర్ చేసుకున్నారు. నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు 2021 అక్టోబర్‌లో తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. వారి విడిపోయిన తర్వాత, సమంతా కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో కరణ్ జోహార్‌తో మాట్లాడుతూ నాగచైతన్య నుండి విడిపోవడం చాలా బాధాకరమని (Samantha) చెప్పింది.

Also Read: Rajasingh: ఉగ్రవాద సంస్థ నాపై కుట్రకు పాల్పడుతోంది: రాజాసింగ్