Family star: ఫ్యామిలీ స్టార్ క్రేజ్.. మల్టీప్లెక్స్ లో జోరుగా టికెట్స్ బుకింగ్స్

Family star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా నెక్ట్ ఫ్రైడే గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ తో “ఫ్యామిలీ స్టార్” సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇది టికెట్ బుకింగ్స్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది. థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. హోల్ సమ్ ఫ్యామిలీ […]

Published By: HashtagU Telugu Desk
Vijay Devarakonda Mass Appeal With Family Star

Vijay Devarakonda Mass Appeal With Family Star

Family star: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా నెక్ట్ ఫ్రైడే గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ తో “ఫ్యామిలీ స్టార్” సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇది టికెట్ బుకింగ్స్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది. థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులు “ఫ్యామిలీ స్టార్” చూడాలనుకుంటున్నారు.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. “ఫ్యామిలీ స్టార్” సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  Last Updated: 01 Apr 2024, 10:29 AM IST