Mohan Babu : ఇంట్లోనే ఉన్నాను, పారిపోలేదు.. దయచేసి నిజాలే చెప్పండి : మోహన్ బాబు

‘‘మీడియాను(Mohan Babu) రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిజాలు చెప్పండి” అని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mohan Babu

Mohan Babu

Mohan Babu : నటుడు మోహన్ బాబు ‘ఎక్స్’ వేదికగా కీలక పోస్ట్ చేశారు.  పరార్ అయ్యానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే మెడికల్ కేర్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తనకు సంబంధించి ముందస్తు బెయిల్‌‌ను హైకోర్టు తిరస్కరించలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.  ‘‘మీడియాను(Mohan Babu) రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిజాలు చెప్పండి” అని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

Also Read :WhatsApp New Features : వాట్సాప్‌ ఆడియో, వీడియో కాల్స్‌.. మరో నాలుగు కొత్త ఫీచర్లు

మోహన్ బాబు ఇటీవలే జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద టీవీ9 ప్రతినిధిపై దాడికి దిగారు. అయితే తాను కావాలని ఆ దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మైక్ తన కంటి దగ్గర పెడుతుండటంతో, ఆవేశంలో అలా చేశానని తేల్చి చెప్పారు. తాను దాడి చేయడం తప్పేనని మోహన్ బాబు ఒప్పుకున్నారు. సదరు మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో అరెస్టు భయంతో ఆయన పరారయ్యారనే ప్రచారం జరిగింది.  దానిపై వివరణ ఇచ్చుకుంటూ ఇప్పుడు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

Also Read :Suchir Balaji : ‘ఓపెన్ ఏఐ’పై దావా.. మరుసటి రోజే సుచిర్ బాలాజీ సూసైడ్.. ఏం జరిగింది ?

కుమారుడు మంచు మనోజ్‌తో మోహన్ బాబుకు ఆస్తి వివాదం నడుస్తోంది.  దీనికి సంబంధించి గొడవలు జరిగిన అనంతరం..  మనోజ్, మోహన్ బాబులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.  ఈ తరుణంలో టీవీ9 వైపు నుంచి హత్యాయత్నం కేసు మోహన్ బాబును వెంటాడుతోంది. టీవీ9 ప్రతినిధిపై దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ఆయనను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. క్రిమినల్ కేసు కావడం వల్ల, దాని తీవ్రత ఎక్కువగా ఉంది. పోలీసులు ఎలా ప్రొసీడ్ అవుతారు అనేది వేచిచూడాలి.

  Last Updated: 14 Dec 2024, 12:54 PM IST