Vijay Deavarakonda : విజయ్ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం.. అనంతపురం వ్యక్తి అరెస్ట్..

అనంతపురంకి చెందిన కిరణ్ అనే వ్యక్తి తనకు చెందిన సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి అసత్యపు వార్తలు, రూమర్స్ ప్రచారం చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Fake News Promotes on Vijay Deavarakonda Police Arrests a Youtuber

Fake News Promotes on Vijay Deavarakonda Police Arrests a Youtuber

సొంతంగా కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో విజయ్ దేవరకొండ(Vijay Deavarakonda) ఒకరు. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు విజయ్ దేవరకొండ. ఇటీవల ఖుషి సినిమాతో మెప్పించిన విజయ్ త్వరలో ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ఇంకో రెండు సినిమాలని లైన్ లో పెట్టాడు.

ఇక సినిమా వాళ్ళ మీద రూమర్స్, అసత్య ప్రచారాలు వస్తాయని తెలిసిందే. గతంలో కూడా విజయ్ దేవరకొండపై నెగిటివ్ వార్తలు, రూమర్స్ వచ్చాయి. అయితే అనంతపురంకి చెందిన కిరణ్ అనే వ్యక్తి తనకు చెందిన సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి అసత్యపు వార్తలు, రూమర్స్ ప్రచారం చేస్తున్నాడు. విజయ్ సినిమాలను, ఆయన సినిమాల్లో హీరోయిన్స్ ని కించపరుస్తూ వీడియోలు చేశాడు.

దీంతో పలువురు విజయ్ దేవరకొండ అభిమానులు ఈ ఛానల్ ని, ఇందులో వీడియోల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఆఛానల్ ని, అందులో వీడియోల్ని డిలీట్ చేయించారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎవరైనా టార్గెట్ గా సెలబ్రిటీలపై వ్యాఖ్యలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా, అవమానించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

Also Read : Salaar Song : సలార్ ఫ్రెండ్షిప్ సాంగ్ విన్నారా? కన్నీళ్లు పెట్టాల్సిందే..

  Last Updated: 14 Dec 2023, 06:44 AM IST