Fahad Fazil Aavesham OTT : ఫహద్ ఫాజిల్ ఆవేశం OTT రిలీజ్ ఎప్పుడు..?

Fahad Fazil Aavesham OTT ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా

Published By: HashtagU Telugu Desk
Fahad Fazil Aavesham Telugu Remake Hero Discussion

Fahad Fazil Aavesham Telugu Remake Hero Discussion

Fahad Fazil Aavesham OTT మలయాళ పరిశ్రమలో ఈ ఇయర్ వరుస సూపర్ హిట్లతో ఇండస్ట్రీ కళకళలాడుతుంది. అక్కడ హిట్ మేనియాని కొనసాగిస్తూ రీసెంట్ గా ఫాహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ ఆవేశం సినిమా 150 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.

ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్ కు ఆడియన్స్ అంతా ఖుషి అవుతున్నారు. జితు మాధవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆవేశం సినిమా లాస్ట్ మంత్ రిలీజై ప్రేక్షకులతో సూపర్ అనిపించుకుంది.

ఇక సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమా ఓటీటీ వెర్షన్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్ లో సినిమా చూడని ఆడియన్స్ తో పాటుగా మళ్లీ మళ్లీ సినిమా చూడాలని అనుకుంటున్న ఆడియన్స్. ఇలా అందరు ఆవేశం డిజిటల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసమే ఆవేశం ఓటీటీ రిలీజ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఆవేశం సినిమాను ప్రైం వీడియోస్ మే 9న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రైం వీడియోస్ వారు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. మలయాళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కూడా ఆవేశం ఓటీటీ వెర్షన్ అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. థియేట్రికల్ వెర్షన్ సూపర్ హిట్ అయిన ఆవేశం ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also Read : Premalu 2 : మొదలైన ప్రేమలు 2 షూటింగ్.. చాలా ఫాస్ట్‌గా ఉన్నారుగా..

  Last Updated: 05 May 2024, 11:17 AM IST