Baby Franchise : ఎక్స్ క్లూజివ్ : లవ్ ఫెయిల్యూర్ కథలన్నీ బేబీ ఫ్రాంచైజ్ లుగా తీస్తే..!

Baby Franchise ఏఎన్నార్ దేవదాసు నుంచి నిన్న వచ్చిన బేబీ వరకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలన్నీ ఒకేరకమైన క్లైమాక్స్ అదే గాఢంగా

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 01:24 PM IST

Baby Franchise ఏఎన్నార్ దేవదాసు నుంచి నిన్న వచ్చిన బేబీ వరకు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలన్నీ ఒకేరకమైన క్లైమాక్స్ అదే గాఢంగా ప్రేమించిన ప్రేయసి మోసం చేసి వెళ్లడంతోనే ముగిశాయి. ప్రపంచంలో చాలా రకాల ప్రేమ కథలు వచ్చాయి. తెలుగులో కూడా N నెంబర్ ఆఫ్ లవ్ స్టోరీ సినిమాలు ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ సినిమాలు వచ్చాయి. అన్నిటిలో కామన్ పాయింట్ హీరోని మోసం చేసి హీరోయిన్ వెళ్లిపోవడం.

పరిస్థితుల కారణమో.. లేదా బలవంతమో ఇలా కారణం ఏదైనా లవ్ ఫెయిల్యూర్ (Love Failure) సినిమాల్లో చాలా వరకు అమ్మాయిలనే నెగిటివ్ గా చేసి అబ్బాయిలను హీరోగా చేస్తారు. ఇలాంటి కథలకు ఇప్పుడే కాదు నెక్స్ట్ జెనరేషన్ లో కూడా బాగానే డిమాండ్ ఉంటుంది. అయితే బేబీ ఈ తరం ఫెయిల్యూర్ లవ్ స్టోరీ.. ఇలాంటి లవ్ స్టోరీ కథలకు బేబీ (Baby) టైటిల్ తోనే ఫ్రాంచైజ్ లుగా తీస్తే ఎలా ఉంటుంది.

ఫెయిల్యూర్ లవ్ స్టోరీగా ఒక అమ్మాయి చేత మోసం చేయబడిన ఒక ప్రేమికుడి కథగా బేబీ తెరకెక్కించారు. ఈ సినిమాలో చెప్పిన ప్రేమకథ పాతదే కానీ నేటితరం ప్రేమ కథను రిప్రెజెంట్ చేస్తూ దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh) తెరకెక్కించిన విధానం యూత్ ఆడియన్స్ కి రీచ్ అయ్యింది. అందుకే ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ కథలకు బేబీ టైటిల్ ని వాడుకుంటే బాగుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. క్రైం సీరీస్ ఫ్రాంచైజ్ లు ఉన్నట్టుగా ఇలా ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ అన్నీ కూడా బేబీ 2, 3, 4 ఇలా చేస్తూ వెళ్తే బాగుంటుందని చెప్పొచ్చు.

కేవలం అమ్మాయిల చేత మోసపోయిన అబ్బాయిల కథలే కాదు అబ్బాయిల చేత ప్రేమ పేరుతో మోసపోయిన కథలు కూడా ఇందులో భాగం అవుతాయి. మరి సాయి రాజేష్ దాకా ఈ ఐడియా వెళ్తే మాత్రం తప్పకుండా బేబీ ఫ్రాంచైజ్ ల గురించి ఆలోచిస్తాడని చెప్పొచ్చు.

Also Read : NTR Devara : దేవరకు రికార్డ్ రేటు.. మైండ్ బ్లాక్ ఆఫర్..!