Akhanda 2: సెంటిమెంట్ గా ఆ రోజునే బాలయ్య అఖండ 2 అనౌన్స్

నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందడం.. ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబో అంటే.. ఆ సినిమా హిట్టే అనే టాక్ బలంగా ఉంది.

Akhanda 2: నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు రూపొందడం.. ఆ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబో అంటే.. ఆ సినిమా హిట్టే అనే టాక్ బలంగా ఉంది. అందుకనే బాలయ్య అభిమానులు ఈ క్రేజీ కాంబో గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో అఖండ 2 రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు బాలయ్య, బాబీ సినిమాని కంప్లీట్ చేయాలి. మరో వైపు పొలిటికల్ గా బిజీ అయ్యాడు. అందుచేత ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది అనేది సస్పెన్స్ గా ఉంది.

మరో వైపు బోయపాటి నెక్ట్స్ మూవీని గీతా ఆర్ట్స్ లో చేయనున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో బోయపాటి, గీతా కాంబో మూవీలో హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బోయపాటి తదుపరి సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న అఖండ 2 సినిమాని ప్రకటిస్తారట. లెజెండ్ సినిమాను కూడా బాలయ్య పుట్టినరోజునే ప్రకటించడం జరిగింది. అందుచేత సెంటిమెంట్ గా ఆ రోజునే అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. డైలాగ్స్ వెర్షెన్ స్టార్ట్ చేశారని తెలిసింది. దీనికి ఎం రత్నం మాటలు అందిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబో మూవీ అంటే.. అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా అఖండ 2 ఉంటుందట. ఇదొక సోషియో ఫాంటసీ మూవీ అని.. ఇప్పటి వరకు బాలయ్యను ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. అఖండ 2 తో బాలయ్య, బోయపాటి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read; NTR Devara: ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఎంత వరకు వచ్చింది?