Site icon HashtagU Telugu

Surya : తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ఫిదా అయినా సూర్య

Surya Telugu

Surya Telugu

తెలుగు ప్రేక్షకులు (Telugu Audience) తనపై చూపిస్తున్న ప్రేమకు హీరో సూర్య (Surya)కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన కంగువ ఈవెంట్లో ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘థియేటర్లలో నా సినిమా విడుదలై రెండేళ్లకు పైగానే దాటింది. అయినా సరే నా సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ-రిలీజ్ కు మీరు ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమను చూసి నేను ఏడ్చేశాను. నాకు మీ ప్రేమ చాలా ముఖ్యం. మనందరికీ ఏదో రక్త సంబంధం ఉంది. ఈ బంధం ప్రత్యేకం’ అని పేర్కొన్నారు.

అలాగే దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు. ‘ప్రాంతీయ సినిమాను కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లొచ్చని రాజమౌళి నిరూపించారు. మా అందరికీ దారి చూపించారు. ఆయనకు థాంక్స్. ఇప్పుడు అలాంటి సినిమాను ఇచ్చేందుకు మేమూ సిద్ధమయ్యాం. ఇది తమిళ సినిమాయే అయినా మీకు తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. ఇకపై భారతీయ సినిమాలే తీస్తాం’ అని పేర్కొన్నారు.

ఇక కంగువ (kanguva) విషయానికి వస్తే.. సూర్య (Suriya) హీరోగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్‌ గా తెరకెక్కింది. శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్‌ 14న గ్రాండ్‌గా విడులవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్‌ సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సందడి చేసారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. కంగువ ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇంగ్లీష్‌ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.

Read Also : Terror Attack : ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు మృతి