బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు. ప్రస్తుతం ఈయన ‘గూఢచారి 2’ (Goodachari 2)మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. షూటింగ్ సెట్ లో ఒక యాక్షన్ సీన్ లో ఒక చోట నుంచి మరొక చోటుకు దూకుతుండగా ఇమ్రాన్ హష్మి మెడకు గాయమైంది. ఈ యాక్షన్ సీన్ ను ఇమ్రాన్ హష్మి స్వయంగా డిజైన్ చేసుకున్నట్టు సమాచారం. ఇమ్రాన్ గాయపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇనుప ముక్క ఆయన మెడకు తగలడంతో గాయమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంతో కాసేపు షూటింగ్ నిలిపివేశారు. గాయం కాగానే ఇమ్రాన్ హష్మి ను దగ్గర్లోని హాస్పటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్స్ చికిత్స చేసి పంపించారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాకు వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అడివిశేష్ విషయానికి వస్తే.. చిన్న పాత్రలతో మొదలై.. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. శేష్ సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనేలా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్ లపైనా అతనికి మంచి అవగాహన ఉంది. అన్నిటికీ బాస్ లాంటి స్క్రిప్ట్ విషయంలో పట్టు ఉంది. స్వయంగా రాయగలడు. ఇవే అతన్ని ఇతర హీరోలకు భిన్నంగా చూపిస్తాయి. ప్రస్తుతం డెకాయిట్ తో పాటు గూఢచారి 2 మూవీస్ చేస్తున్నాడు.
Read Also : Accident : అజ్మేర్ లో విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..బాబు సంతాపం