బతుకమ్మ పండుగ సీజన్‌కి అందంగా సరిపడేలా బుల్లి తెర బీట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి విడుదలైన “ఏలే ఏలే ఏలా బతుకమ్మ ఉయ్యాల” పాట ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. కొత్తగా ప్రారంభమైన ఈ ఛానల్ కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 46 వేల వ్యూస్ సాధించడం విశేషం. ఇది ఈ పాట పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, బతుకమ్మ పండుగపట్ల ఉన్న భావోద్వేగాల ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు. బతుకమ్మ అనేది తెలంగాణ సాంస్కృతిక ప్రతీక — ఆ సాంస్కృతిక సౌందర్యాన్ని ఈ పాట అత్యంత ఆహ్లాదకరంగా ఆవిష్కరించింది.
Health Tips: జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
పాటలోని సాహిత్యం, సంగీతం, నటన, దర్శకత్వం ఇలా అన్నీ ఒకే తాటిపై నడుస్తూ ప్రేక్షకుడిని ఆ పల్లె వాతావరణంలోకి తీసుకువెళ్తాయి. లిరిక్స్ రాసిన మనోజ్ జూలూరి పదాలు బతుకమ్మ సీజన్‌లోని ఆత్మీయతను, మహిళల అనుబంధాన్ని, ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను అద్భుతంగా ప్రతిబింబించాయి. సంగీత దర్శకుడు మోహన్ అందించిన స్వరాలు, గాయని వాగ్దేవి మధుర గానం కలసి పాటను మరింత శ్రావ్యంగా మలిచాయి. ముఖ్యంగా యాంకర్ జాను చేసిన నటన ఈ పాటకు కొత్త రుచిని తెచ్చింది. ఆమె భావ వ్యక్తీకరణలోని సహజత్వం బతుకమ్మ సంబరాల అసలు మాధుర్యాన్ని చూపిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌కు బలమైన సాంకేతిక మద్దతు లభించింది. నిర్మాత నిమ్మగడ్డ సుజాత , సహనిర్మాత మంగమ్మ అందించిన నిర్మాణ విలువలు, అందమైన లొకేషన్లు, క్యామరామెన్ దేవి ప్రసాద్ అందమైన ఫ్రేములు, శ్రీనివాస్ కొరియోగ్రఫీ అన్నీ కలసి ఈ పాటను ఒక దృశ్యానుభూతిగా మార్చాయి. యాంగ్ డైరెక్టర్ సునీల్ రాజ్ ప్రతీ విభాగం నుంచి ఉత్తమమైన పనితీరును రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ఆయన కృషి ప్రతి సీన్‌లోనూ కనపడుతుంది. మొత్తంగా చూస్తే “ఏలే ఏలే ఏలా బతుకమ్మ ఉయ్యాల” పాట తెలంగాణ సాంస్కృతిక మాధుర్యాన్ని ఆధునిక రూపంలో ప్రజల హృదయాలకు చేరవేసింది. ఇలాంటి సాహిత్యపరమైన, భావోద్వేగపూర్ణమైన పాటలు మరెన్నో రావాలని శ్రోతలు కోరుకుంటున్నారు.
