Crazy Combination: టాలీవుడ్ లో డైనమిక్ జోడీ.. రవితేజతో రొమాన్స్ చేయనున్న రష్మిక!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ పక్కన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించనుంది.

Published By: HashtagU Telugu Desk
Ravi And Rashmika

Ravi And Rashmika

రెండు వరుస బ్లాక్‌బస్టర్ విజయాలను సాధించిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ పై గురి పెట్టాడు. రవితేజ హీరోగా తన రాబోయే యాక్షన్ డ్రామాతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. గతంలో రవితేజతో కలిసి విజయవంతమైన “ధమాకా” చిత్రంలో నటించిన శ్రీలీల తారాగణంలో భాగం కానుందని ప్రాథమిక పుకార్లు సూచించగా, ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుందని సమాచారం.

సౌత్ ఇండియాలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన రష్మిక మందన్న రవితేజతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. రష్మిక మందన్న రవితేజ కలయికలో రాబోయే చిత్రం  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతుండటం విశేషం. కాగా ఈ మేకర్స్ ఇప్పటికే  “పుష్ప 2” నిర్మాణంలో భాగమైన విషయం తెలిసిందే. రవితేజ-రష్మిక డైనమిక్ జోడీ టాలీవుడ్ అంచనాలను పెంచడమే ఖాయమే.

Also Read: Drug Case: హీరో నవదీప్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

  Last Updated: 20 Sep 2023, 04:05 PM IST