OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘ఓజి’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దాదాపు 75 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల బ్యాలన్స్ షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి అవ్వడంతో.. ఈ మూవీ షూటింగ్ మళ్ళీ పట్టాలు ఎక్కనుంది. కాగా ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు.
దీంతో మూవీ టీం వచ్చే నెల నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ విషయం గురించి పవన్ అభిమాని ఒకరు.. నిర్మాతలను సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దానికి నిర్మాత బదులిస్తూ.. “ఒక ఫ్లో రెడీ, పోతారులే అందరూ” అంటూ బదులిచ్చారు. ఇక ఈ ట్వీట్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Oka flow ready… Pothaaru le andaru.
— DVV Entertainment (@DVVMovies) May 26, 2024
కాగా ఈ సినిమా దర్శకుడు సుజిత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఓజి మూవీ గురించి మాట్లాడుతూ.. మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన ‘ఐకిడో’ ఫైట్ ఈ మూవీలో ఉందని తెలియజేసారు. ఈ ఫైట్ గురించి పవన్ కళ్యాణ్ కి చెప్పగా, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారట. అంతేకాదు ఆ ఫైట్ బాగా రావాలని ముంబై, పూణే నుంచి ఐకిడో మాస్టర్స్ ని పిలిపించుకొని మరి ప్రాక్టీస్ తీసుకున్నారట.
ఆ ఫైట్ సీన్ ని హాఫ్ డేలో చేయాల్సిందట. కానీ బాగా రావాలని పవన్ భావించడంతో.. దాదాపు మూడు రోజుల పాటు ఆ సీన్ ని చిత్రీకరించారట. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫొటోస్ గతంలో నెట్టింట లీకైన సంగతి అందరికి తెలిసిందే. పవన్ అంత జాగ్రత్త తీసుకోని చేసిన ఆ ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
#OG September 27th jathini denguhuname🥵🥵🥵🥵🔥🔥🔥🔥 🥹🥹
#BVVonMay31st @PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/H8ue1Vkz9N— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) May 26, 2024