Dunki Salaar 1 Animal 3 సినిమాలు 3000 కోట్ల టార్గెట్.. గెలిచేదెవరు..?

Dunki Salaar 1 Animal ఇండియన్ బాక్సాఫీస్ పై సత్తా చాటేందుకు డిసెంబర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 01:50 PM IST

Dunki Salaar 1 Animal ఇండియన్ బాక్సాఫీస్ పై సత్తా చాటేందుకు డిసెంబర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు స్టార్స్ సై అంటున్నారు. డిసెంబర్ 1 నుంచి 22వరకు వరుస సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా 3 సినిమాలు మాత్రం 3000 కోట్ల టార్గెట్ ని రీచ్ అవాలని పెట్టుకున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు అంటే..

డిసెంబర్ 1న అనిమల్ :

అర్జున్ రెడ్డితో తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన సందీప్ వంగ అదే సినిమా హిందీలో తీసి అక్కడ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అనిమల్ అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ లో రష్మిక హీరోయిన్ గా నటించిన అనిమల్ సినిమా టీజర్ అదరగొట్టగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతుంది. 1000 కోట్ల రీచ్ అయ్యే స్కోప్ ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ఉందని తెలుస్తుంది.

డిసెంబర్ 21న డంకీ :

దశాబ్ధ కాలం పైగా కెరీర్ లో హిట్ లేని బాద్షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ లతో రెండు సూపర్ హిట్లు కొట్టాదు. ఇక ఇప్పుడు డంకీ అంటూ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో తెరకెక్కిన డంకీ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా షారుఖ్ ఈ సినిమాతో మరోసారి 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు.

Also Read : Bigg Boss Arjun : బిగ్ బాస్ అర్జున్ కి మెగా ఛాన్స్.. ఉప్పెన డైరెక్టర్ ఓపెన్ గా చెప్పేశాడు..!

డైనోసార్ సలార్ డిసెంబర్ 22న :

ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఈ కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో ఊహించవచ్చు. హోంబలే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. కె.జి.ఎఫ్ కి ఏమాత్రం తగ్గకుండ దాన్ని మించి ఈ సినిమా ఉండబోతుంది. డిసెంబర్ 22న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా 1000 కోట్ల సినిమా అని ప్రేక్షకులు నమ్ముతున్నారు.

ఈ 3 సినిమాలతో 3000 కోట్లని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలు ఆ ఫిగర్ ని టచ్ చేస్తాయా లేదా అన్నది చూడాలి. ఈ 3 సినిమాల మీద అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join