Site icon HashtagU Telugu

Dulquer Salmaan : ప్రభాస్ కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్? ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన దుల్కర్..

Dulqer Salmaan Plays a key role in Prabhas Kalki 2898 AD Movie Interesting Facts

Dulqer Salmaan Plays a key role in Prabhas Kalki 2898 AD Movie Interesting Facts

ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. ప్రాజెక్టు K సినిమాగా మొదలుపెట్టి ఇటీవలే హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్లో కల్కి టైటిల్ ని అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అలాగే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అది చూసి హాలీవుడ్ రేంజ్ ని మించి ఉంది అంటూ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. ఇక కల్కి సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్(Kamal Haasan), అమితాబ్(Amitabh Bachchan), దిశా పటాని, రానా దగ్గుబాటి(Rana Daggubati) ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇంకా చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉంటారని సమాచారం.

తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ప్రభాస్ కల్కి సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఉండబోతున్నాడు. దుల్కర్ వరుసగా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీతారామం సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు. త్వరలో కింగ్ అఫ్ కొత్త అనే సినిమాతో రాబోతున్నాడు దుల్కర్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) మాట్లాడుతూ.. నేను కల్కి సినిమాలో ఉన్నది నిజమే. కానీ సినిమాలో ఏంటి, ఎలాంటి పాత్ర అనేది మాత్రం చెప్పను. షూటింగ్ కోసం సెట్ లోకి అడుగు పెట్టాక అద్భుతమనిపించింది. డైరెక్టర్ నాగి మొదటి సినిమాకి, ఈ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో అంతా ఫ్యూచర్ ని చూపిస్తాడు. ప్రభాస్ తో సీన్స్ గురించి నేనేం చెప్పను. ఇంతకంటే ఎక్కువ కల్కి సినిమా గురించి మాట్లాడను అని అన్నారు.

దీంతో కల్కి సినిమాలో దుల్కర్ ఉన్నాడు అని తెలియడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే సంవత్సరం కల్కి సినిమా రిలీజ్ కానుంది.

 

Also Read : Bhakta Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ షురూ