Tollywood Stars: ‘డబుల్’ యాక్షన్ కు టాలీవుడ్ స్టార్స్ సై.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే!

హీరో రెండు పాత్రల్లో (Dual-Role) కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. టాలీవుడ్ లో ద్విపాత్రాభినయ చిత్రాలకు క్రేజ్ ఉంది.

Published By: HashtagU Telugu Desk
Tollywood

Tollywood

సిల్వర్ స్క్రీన్ పై ఇష్టమైన హీరోనూ చూస్తేనే ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. అదే హీరో రెండు పాత్రల్లో (Dual-Role) కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే. టాలీవుడ్ (Tollywood) లో ద్విపాత్రాభినయ చిత్రాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. స్టార్ యాక్టర్ డ్యూయల్ రోల్ చేసినప్పుడల్లా ఆ సినిమాని చూసేందుకు అభిమానులు చాలా ఎక్సైట్ అవుతారు. డ్యూయల్ రోల్ పాత్రలపై మన టాలీవుడ్ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. తాజగా కొందరు టాలీవుడ్ స్టార్స్ డ్యూయల్ పాత్రలతో అదరగొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఆ చిత్రాలనీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తమ తదుపరి సినిమాల్లో డ్యూయల్ రోల్ (Dual-Role) లో కనిపించబోతున్నారు. ఆ వివరాలు మీకోసం

రామ్ చరణ్ (Ram Charan)

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన రాబోయే చిత్రం RC 15 లో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. చరణ్ తండ్రీ కొడుకుల పాత్రలో నటించే అవకాశం ఉంది. మొదట ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తగా కనిపించనున్నాడు. ఇక బుచ్చిబాబు సనతో చరణ్ తన సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం (Dual-Role) చేస్తున్నాడని సమాచారం.

ప్రభాస్ (Prabhas)

ప్రశాంత్ నీల్ సాలార్ సినిమాలోనూ ప్రభాస్ రెండు పాత్రలు పోషిస్తాడు. రెండు పోస్టర్లలో ఆయన డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడంతో ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని అనుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన రాబోయే చిత్రం ఎన్టీఆర్ 30లో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. గతంలో ఎన్టీఆర్ డ్యూల్ పాత్రలతో మెప్పించాడు. అదుర్స్, ఆంధ్రావాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.

కమల్ హాసన్ (Kamal)

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ తన రాబోయే చిత్రం ఇండియన్ 2లో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. భారతీయుడు చిత్రం మొదటి భాగంలోనూ కమల్ ద్విపాత్రాభినయంలో కనిపించాడు. ఒకరు సేనాపతిగా, మరొకరు చంద్రబోస్ గా ఆకట్టుకున్నారు.

సమంత (Samantha)

బాలీవుడ్ కథనాల ప్రకారం భేదియా ఫేమ్ దర్శకుడు అమర్ కౌశిక్ వాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, సమంత ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో సామ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే ఇది సమంత మొదటి ద్విపాత్రాభినయం అవుతుంది.

Also Read: Class1 Student Arrested: రేప్ ఆరోపణలు.. ఒకటో తరగతి పిల్లాడు అరెస్ట్!

  Last Updated: 17 Apr 2023, 04:57 PM IST