Site icon HashtagU Telugu

Double Ismart : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్..!

Double Ismart Streaming Amazon Prime

Double Ismart Streaming Amazon Prime

రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. ఈ సినిమాలో కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించగా మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఆగష్టు 15న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. పూరీ మార్క్ మ్యాజిక్ కనిపించని ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. ఫలితంగా సినిమా పూరీ ఖాతాలో మరో ఫెయిల్యూర్ గా నిలిచింది.

ఐతే సూపర్ హిట్ అయిన సినిమాలే నెల లోపు OTTలో వస్తుండగా ఫ్లాపైన సినిమాలను 20 రోజుల్లోనే తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైం వీడియో లో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ చేశారు. ఐతే థియేటర్ లో రిజెక్ట్ చేసిన ఈ సినిమాను ఓటీటీ ఆడియన్స్ అయినా ఓటు వేస్తారా లేదా అన్నది చూడాలి.

రామ్ (Ram) ఇప్పటికే ది వారియర్, స్కంద సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు. డబుల్ ఇస్మార్ట్ తో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ తిరిగి కంబ్యాక్ ఇస్తాడేమో అనుకోగా డబుల్ ఇస్మార్ట్ లైగర్ కి తోడుగా డిజాస్టర్ ఖాతాలో పెట్టాడు పూరీ.

డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమా డిజిటల్ రిలీజ్ లో అయినా ప్రేక్షకుల మెప్పు పొందుతుందేమో చూడాలి. ఒకప్పటిలా ఎలా తీసినా సినిమాను చూసే ఆడియన్స్ తగ్గిపోయారు. కంటెంట్ బాగున్న సినిమాలు వాటికి తగినట్టుగానే కమర్షియల్ హంగులతో ఉన్న సినిమాలు ఆదరిస్తున్నారు. క్రేజీ కాంబో మాత్రమే కాదు మంచి కథతో సినిమా చేస్తేనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తారన్న విషయాన్ని గుర్తించాలి.

Also Read : Balayya In Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!