Double Ismart: క్వాలిటీలో తగ్గేదెలా.. వాయిదా దిశ‌గా డబుల్ ఇస్మార్ట్

రామ్ పోతినేని హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా డ‌బుల్ ఇస్మార్ట్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని మొదట మార్చి 8ని రిలీజ్

Double Ismart: రామ్ పోతినేని హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా డ‌బుల్ ఇస్మార్ట్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని మొదట మార్చి 8ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా చెప్పిన సమయానికి విడుదల చేయకపోవచ్చని సినీ వర్గాలు చెప్తున్నాయి .

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో ఇస్మార్ట్ శంకర్ ఒకటి.ఈ చిత్రం దర్శకుడిగా పూరి జగన్నాథ్ కు కెరీర్ పరంగా బ్రేక్ ని అందించింది. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న డబుల్ ఇస్మార్ట్. తో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. క్వాలిటీ విషయంలోనూ పూరీ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరగడం లేదని… అందుచేత డబుల్ ఇస్మార్ట్ మూవీ వాయిదా పడడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

సమ్మర్ తర్వాతే డబుల్ ఇస్మార్ట్ విడుదల అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని.. డబుల్ ఇస్మార్ట్ అనుకున్న డేట్ కే విడుదల కానుందని మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ అయ్యిందట. మిగిలిన 20 శాతం షూటింగ్ ను ఫిబ్రవరిలో కంప్లీట్ చేయనున్నారని సమాచారం. అంతే కాకుండా.. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ కూడా రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మణిశర్మ ఇప్పటికే మూడు పాటలు ఇవ్వడం.. ఆ పాటలను చిత్రీకరించడం కూడా జరిగిందట. ఇక రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ రెండు పాటలు కూడా సెట్ సాంగ్సే అని.. ఈ పాటలు ఇచ్చిన వెంటనే హైదరాబాద్ లో సెట్ వేసి షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. పూరి చాలా స్పీడుగా సినిమాలు తీస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా తనదైన స్టైల్ లో ఫాస్ట్ గా కంప్లీట్ చేయనున్నారట. సంజయ్ దత్ విలన్ గా ఈ మూవీలో రామ్, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట.

పూరీ జగన్నాథ్ లైగర్ డిజాస్టర్ తో డౌన్ ఫాల్ లో ఉన్నాడు. అటు రామ్ కూడా స్కంద చిత్రంతో విపరీతమైన ట్రోలింగ్ ని చూసాడు. కాబట్టి ఈ ఇద్దరికీ డబుల్ ఇస్మార్ట్ ప్రాజెక్టు చాలా కీలకం.మరి ఈ చిత్రం ఇద్దరికీ హెల్ప్ అవుతుందో లేదో చూడాలి.

Also Read: Sivakarthikeyan: ‘అయలాన్’ సినిమా థీమ్ పార్క్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: హీరో శివ కార్తికేయన్