Ram ఉస్తాద్ రామ్ ఈ నెల 15న డబుల్ ఇస్మార్ట్ సినిమాతో రాబోతున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ఇది వస్తుంది. రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేందుకు వస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాలన్నీ అదిరిపోయాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా కోసం రామ్ పడిన కష్టాన్ని చెప్పుకొచ్చారు.
స్కంద సినిమాలో కాస్త బలంగా కనిపించాల్సి ఉండగా దాని కోసం బరువు పెరిగిన రామ్ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) కోసం బరువు తగ్గాల్సి ఉండగా దాని కోసం చాలా రిస్క్ తీసుకున్నాడని తెలుస్తుంది. సరిగా నెల రోజులు టైం పెట్టుకుని యూఎస్ వెళ్లి 18 కేజీల దాకా వెయిట్ తగ్గానని చెప్పాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ లో తన లుక్ ఎలా ఉందో డబుల్ ఇస్మార్ట్ లో కూడా అదే విధంగా ఉండాలని బరువు తగ్గాల్సి వచ్చిందని అన్నారు.
Also Read : Harish Shankar : వాళ్లకు లేని బాధ మీకెందుకు.. డైరెక్టర్ ఎటాక్..!
సో ఈ సినిమా కోసం రామ్ చాలా కష్టపడి ఒళ్లు తగ్గించేశాడని తెలుస్తుంది. రామ్ పూరీ (Puri) ఈ కాంబో మరోసారి ఆడియన్స్ కు ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా పక్కా ట్రీట్ ఇచ్చేలా సినిమాను తెరకెక్కించాడు పూరీ. లైగర్ తో అంచనాలను అందుకోని పూరీ ఈసారి మాత్రం పక్కా కాలిక్యులేషన్స్ తో డబుల్ ఇస్మార్ట్ తీసినట్టు తెలుస్తుంది. మరి డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.
ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ కు రవితేజ మిస్టర్ బచ్చన్ తో ఫైట్ జరుగుతుంది. ఐతే రెండు సినిమాల కంటెంట్ వేరే అయినా ఇద్దరు మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఏది వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.