Site icon HashtagU Telugu

Ram Charan : ‘పెద్ది’ డైరెక్టర్ చరణ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

Charan Gift To Buchhi

Charan Gift To Buchhi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) తన పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేకమైన కానుకను ‘పెద్ది'(Peddi) సినిమా దర్శకుడు బుచ్చిబాబు(Buchhibabu)కు పంపించారు. ఈ గిఫ్ట్‌లో హనుమాన్‌ చాలీసా పుస్తకం, హనుమంతుడి విగ్రహం, శ్రీరాముని పాదుకలు ఉండగా, వీటితో పాటు “నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నీపై ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చరణ్‌ స్వహస్తంగా రాసిన ఓ చిన్న నోట్‌ కూడా ఉంది. ఈ కానుకలను అందుకున్న బుచ్చిబాబు ఎంతో ఆనందంగా ఫీలై, వాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ చరణ్‌ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

RK Roja : రోజా రోత అంటూ మంత్రి సంధ్యారాణి చిందులు

ప్రస్తుతం రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో ‘పెద్ది’ అనే సినిమా రూపొందుతోంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, ఒక క్రీడా నేపథ్య రూరల్ డ్రామాగా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన రామ్‌చరణ్‌ ఫస్ట్‌లుక్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. “గుర్తింపు కోసమే పెద్ది పోరాటం చేస్తాడు” అంటూ చరణ్‌ స్వయంగా పోస్టర్‌తో చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ పని చేస్తున్న ఈ చిత్రం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.