Assets of Krishnam Raju : కృష్ణంరాజుకు ఎన్ని వందలకోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?

ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు.

Published By: HashtagU Telugu Desk
Krishnam Raju Imresizer

Krishnam Raju Imresizer

ప్రముఖ సీనియర్ నటుడు, రాజకీయనాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కృష్ణంరాజుకు ఎన్నివేల కోట్ల ఆస్తులున్నాయి. ఈ విషయంపై జోరుగా చర్చిస్తున్నారు నెటిజన్స్. కృష్ణంరాజుకు ఎన్నికోట్ల ఆస్తులున్నాయి..ఎక్కడెక్కడ ఉన్నాయి…తెలుసుకుందాం.

కృష్ణంరాజు…వెండి తెరమీదే కాదు బయట ప్రపంచంలోనూ ఎంతో మంచి పేరుంది. ఎవడి జోలికి వెళ్లడు…వివాదాలకు దూరంగా ఉంటాడు. మర్యాద రామన్నలా ఉంటారని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న మాట. సినీరంగంలో, రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఆయన దాదాపు 60ఏళ్లకు పైగా తన సినీజీవితాన్ని కొనసాగించారు. సంపన్న కుటుంబంలో జన్మించడంతో…కృష్ణంరాజుకు వారసత్వంగా కొంత ఆస్తి వచ్చింది. దానికి తోడు సినిమాళ్లో నటిస్తూ కొంత సంపాదించారు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన ఆస్తి గురించి చర్చ మొదలైంది. గతంలో ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..కృష్ణంరాజుకు ఎంత ఆస్తుందో తెలుసుకుందాం.

Also Read : కనకమామిడి ఫాంహౌజ్ లో సోమవారం కృష్ణంరాజు అంత్యక్రియలు

పశ్చిమగోదావరి జిల్లాలోని మొగళ్తూరులోని సంపన్న కుటుంబంలో జన్మించిన కృష్ణంరాజు…తల్లిదండ్రుల వారసత్వంగా సొంతఊరిలో వందల ఎకరాల భూమి ఉంది. దాని నిర్వహణ అంతకూడా ఆయన బంధువులే చూసుకుంటున్నారట. అంతేకాదు నాలుగు ఖరీదైన ఇళ్లు ఉన్నాయట. ప్రస్తుతం ఆయన జూబ్లిహిల్స్ లో నివాసముంటున్న ఇళ్లు ఖరీదు రూ. 18కోట్ల వరకు ఉంటుందట. అంతేకాదు మోయినాబాద్ దగ్గర ఆయన కు ఫాంహౌజ్ కూడా ఉంది. కృష్ణంరాజు దగ్గర అప్పట్లోనే 4 కిలోల బంగారం ఉందట. ప్రస్తుత మార్కెట్ ధర చాలా ఉండొచ్చని అంచనా. దీని ప్రకారం కృష్ణంరాజు ఆస్తి విలువ దాదాపు 2వందల కోట్లకు పైగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ఇక తన వారసుడిగా సినీఆరంగ్రేటం చేసిన ప్రభాస్ కూడా బాగానే సంపాదించారు. కృష్ణంరాజు రెబల్ స్టార్ గా కాదు..మంచి మనస్సున్న మనిషిగా ఎంతో పేరు గడించారని ప్రముఖులు అంటున్నారు. ఆయన మరణం సినీపరిశ్రమకు తీరని లోటని అభిమానులు నివాళులర్పిస్తున్నారు.

  Last Updated: 11 Sep 2022, 08:19 PM IST