Siya Gautam: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన నేనింతే హీరోయిన్.. ఫొటోస్ వైరల్?

  • Written By:
  • Updated On - March 11, 2024 / 03:36 PM IST

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలామందికి ఫెవరేట్ మూవీ. 2008 లో వచ్చిన ఈ సినిమాలో రవితేజకు సరసన శియా గౌతమ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో డైలాగ్స్ యువతకు చాలా దగ్గర ఉంటాయి. రెగ్యులర్ గా యూత్ వాడే డైలాగ్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు పూరిజగన్నాథ్. చక్రి సంగీతం అందించిన ఈ సినిమాలో సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సియా గౌతమ్ ఈ సినిమా తర్వాత కొద్ది సంవత్సరాలు పాటు యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ఎలా ఉంది ఎక్కడ ఉంది అన్న విషయాల గురించి చాలామందికి తెలియదు. మరి ఈమె ప్రస్తుతం ఏం చేస్తోంది ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సియా గౌతమ్ అసలు పేరు అదితి గౌతమ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సియా గౌతమ్ గా మార్చుకుంది. నేనింతే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సియా, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. హిందీలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ సినిమాలో కనిపించింది.

ఈ సినిమా హిట్ అయినప్పటికీ అమ్మడికి అనుకునేంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగులో చిన్న చిన్న సినిమాల్లో నటించింది. కాగా ఇప్పుడు సియా గౌతమ్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందా అని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. సినిమాలకు దూరంగా ఉన్న సియా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ నేనింతే సినిమాలో బొద్దుగా కనిపించిన సియా ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హాట్ హాట్ ఫోటోలు క్రేజీ వీడియోలను షేర్ చేస్తుంది ఈ భామ. అయినా కూడా ఆఫర్స్ మాత్రం అంతంతమాత్రమే వస్తున్నాయి. మరి త్వరలోనే సాలిడ్ కం బ్యాక్ ఇస్తుందోమో చూడాలి మరి.