Srikanth and Ooha: ఊహతో విడాకులు.. శ్రీకాంత్ రియాక్షన్ ఇదే!

విడాకుల వ్యవహరం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ గా మారింది. అయితే సెలబ్రిటీల్లో డివోర్స్ తీసుకునే సంఖ్య పెరిగిపోతోంది.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 03:56 PM IST

విడాకుల వ్యవహరం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారుతోంది. అయితే సెలబ్రిటీల్లో డివోర్స్ తీసుకునే సంఖ్య పెరిగిపోతోంది. టాలీవుడ్ బ్యూటీ కపుల్ సమంత, నాగచైతన్య డివోర్స్ వ్యవహరంతో అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ షాక్ తిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచు మనోజ్ కూడా డివోర్స్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో జంట డివోర్స్ తీసుకోబోతుందనే వార్త చక్కర్లు కొడుతున్నాయి. హీరో శ్రీకాంత్ తన భార్య  ఊహ కు విడాకులు ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.

దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ, ప్రస్తుతం తన భార్య ఊహాతో తమిళనాడులో ఓ టూర్ ఉన్నానని, చాలా సంతోషంగా వెకేషన్ గడుపుతున్నానని విడాకుల వార్తను కొట్టిపారేశాడు. ఈ వ్యక్తిగత ఆధ్యాత్మిక యాత్ర తర్వాత సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లనున్నారు శ్రీకాంత్. టాలీవుడ్ లో శ్రీకాంత్, ఊహ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.

“ఆమె” సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత 1997లో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో అన్యోన్యంగా ఉండే జంటల్లో ఈ జంట ఒకటి. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. యాంకర్ సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల గురించి ఇంతకుముందు ఇలాంటి రూమర్స్ విన్నాం. వీరిద్దరూ ఆనందంగా ఉన్నా విడాకుల వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు ఇద్దరూ.