Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ తో మరోసారి రొమాన్స్ పంచుకోబోతున్న బ్యూటీ

Disha Prabhas

Disha Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏ.డి’ సినిమా వన్ బిలియన్ క్లబ్‌లో చేరి భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘బ్రహ్మ రాక్షస్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘ఫౌజీ’ (Fauji) అనే దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇమాన్వి ప్రధాన కథానాయికగా నటిస్తుండగా.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) సెకండరీ లీడ్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tollywood : నా సినిమాల‌ను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ

‘కల్కి 2898 ఏ.డి’లో ప్రభాస్ సరసన దిశా పటానీ కేవలం కాసేపే స్క్రీన్ టైమ్ ఉన్నా, తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఇద్దరికీ స్క్రీన్ షేర్ తక్కువ ఉండటంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అయితే ‘ఫౌజీ’ సినిమాలో వీరిద్దరూ మరింత స్ర్కీన్ టైమ్ పంచుకోనున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. యూనిట్ నుండి అధికారిక సమాచారం అందకపోయినా, ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.