Yeshaswi fire on Music Director Radhan చైల్డ్ ఆర్టిస్ట్ గా అతడు సినిమాలో నటించిన దీపక్ సరోజ్ హీరోగా తన్వి నేగి హీరోయిన్ గా యశస్వి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సిద్ధార్థ్ రాయ్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకరోజు ముందు గురువారం నిర్వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యశస్వి స్పీచ్ అందరిని సర్ ప్రైజ్ చేసింది.
తన లైఫ్ జర్నీ సినిమాల్లో తన ప్రయాణం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు యశస్వి. తను ఇక్కడ ఉండటానికి తన వైఫ్ కారణమని.. ఆ తర్వాత తన స్నేహితుడు కారణమని అన్నారు. రెండేళ్లుగా సినిమా కోసం బాగా కష్టపడ్డామని సినిమాల్లోకి వచ్చే ముందు తను పడిన కష్టాన్ని చెప్పాడు.
ఇక సినిమా చేస్తున్న టైం లో తనకు హెల్ప్ చేసిన వారి గురించి చెప్పాడు. ఇదే క్రమంలో సిద్ధార్థ్ రాయ్ మ్యూజిక్ డైరెక్ట రధన్ పై సంచలన కామెంట్స్ చేశాడు యశస్వి. రధన్ ఒక మంచి టెక్నిషియన్ కావొచ్చు కానీ వర్క్ విషయంలో అతను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడని అన్నారు. తను చెన్నైలో ఉన్నాడు కాబట్టి బ్రతికిపోయాడు లేదంటే చాలా గొడవలు అయ్యేవని అన్నారు యశస్వి. అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి సినిమాలకు మ్యూజిక్ అందించిన రధన్ టాలెంట్ ఉన్నా అతను చేస్తున్న కొన్ని తప్పుల వల్ల డైరెక్టర్స్ అతని మీద గుర్రుగా ఉన్నారు.
ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే టీజర్ చూసే సుకుమార్ గారు తన ఆఫీస్ కి పిలిపించుకున్నారు. సినిమా చూసి ఫస్ట్ హాఫ్ అవ్వగానే తనకు హగ్ ఇచ్చారు. తన బ్యానర్ లో సెకండ్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. సుకుమార్ గారి వల్ల సిద్ధార్థ్ రాయ్ గురించి అందరికీ తెలిసింది. అందుకు తన లైఫ్ మొత్తం ఆయనకు రుణపడి ఉంటానని అన్నారు యశస్వి.
Also Read : Payal Rajput Mangalavaram : బుల్లితెర మీద మంగళవారం అదిరిపోయే రేటింగ్..!