Vijay GOAT కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathi Vijay) రీసెంట్ గా గోట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళంలో తప్ప మిగతా అన్నిచోట్ల ఫ్లాప్ టాక్ వచ్చింది. వెంకట్ ప్రభు ఈ సినిమా కోసం డీ ఏజింగ్ టెక్నాలజీని ఆడారు కానీ అది ఆడియన్స్ కు అంతగా నచ్చలేదు. ఇక రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ సినిమాను తిప్పికొట్టారు.
విజయ్ గోట్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడానికి దర్శకుడు వివరణ ఇస్తూ దానికి ఐపిఎల్ టీం CSK రిఫరెన్స్ ను సినిమాలో చూపించడమే అని అన్నారు. గోట్ సినిమాలో CSK రిఫరెన్స్ సీన్స్ ఉంటాయి. దాని వల్ల ఆర్సీబీ ఫ్యాన్స్, ముంబై ఇండియన్ ఫ్యాన్స్ సినిమాను ఇష్టపడలేదని అన్నారు. సినిమా కథ కథనం బాగుంటే ఎలాంటి సినిమా అయినా చూస్తారు కానీ వెంకట్ ప్రభు CSK వల్లే సినిమా పోయింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు.
ఐపిఎల్ ఫ్యాన్స్ కి నచ్చలేదని..
తాను CSK అభిమానిని.. అందుకే సినిమాలో ఆ రిఫరెన్స్ లు వాడుకున్నాం. ఐతే అది MI, RCB ఇంకా వేరే ఐపిఎల్ ఫ్యాన్స్ కి నచ్చలేదని అన్నారు. అసలు సినిమా రిజల్ట్ కి ఐపిఎల్ కి సంబంధమే లేదు. తను తీసిన సినిమా ఫలితం దాని వల్లే పోయిందని చెప్పడంతో వెంకట్ ప్రభు (Venkat Prabhu) మీద నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
విజయ్ చివరి సినిమాగా వచ్చిన గోట్ రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటే కేవలం తమిళ్ లో ఏదో ఆయనకున్న ఫాలోయింగ్ కొద్దీ ఆడేస్తుంది. విజయ్ గోట్ సినిమా దళపతి విజయ్ ఫ్యాన్స్ ని కూడా నిరాశపరచింది. ఐతే విజయ్ మరో సినిమా చేస్తారా లేదా దీనితోనే సినిమాకు గుడ్ బై చెబుతారా అన్నది చూడాలి.
Also Read : Pro Kabaddi Schedule: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది..!