Site icon HashtagU Telugu

Sivaji : శివాజీ సినిమాలో అపరిచితుడు.. డిలీట్ సీన్ మీరు చూశారా..?

Director Shankar Re Create Aparichithudu Scene in Sivaji The Boss Movie with Vivek

Director Shankar Re Create Aparichithudu Scene in Sivaji The Boss Movie with Vivek

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar), సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ ‘శివాజీ ది బాస్'(Sivaji). సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ చిత్రం 2007లో రిలీజ్ అయ్యింది. అపరిచితుడు వంటి ఓ కల్ట్ బొమ్మ తరువాత శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, అందులోనూ రజిని హీరో కావడంతో తెలుగులో కూడా భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో అపరిచితుడు మూవీలోని ఓ సీన్ ని దర్శకుడు శంకర్ మళ్ళీ రీ క్రియేట్ చేశారు. కానీ ఆ సీన్ ని ఫైనల్ కట్ నుంచి డెలీట్ చేసేసారు. ఇంతకీ అది ఏ సీన్..?

అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ ని ప్రకాష్ రాజ్ పోలీస్ స్టేషన్ లో విచారించే సన్నివేశం అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. విక్రమ్‌ని ప్రకాష్ రాజ్ విపరీతంగా కొట్టడంతో మైకం వచ్చి పడిపోతాడు. ఆ తరువాత హీరో బాడీలో అపరిచితుడు మేల్కొని ప్రకాష్ రాజ్ ని కొట్టి డైలాగ్ చెబుతాడు. ”రాము అమాయకుడు, ఆ ఐదు హత్యలు నేనే చేశాను” అనే చెప్పే డైలాగ్.. రాము, అపరిచితుడు పాత్రలతో విక్రమ్ ఒకే సమయంలో చేసి అదరగొడతారు. ఆ సీన్ కి థియేటర్ లో విజిల్స్ పడ్డాయి. ఆ సన్నివేశాన్నే శివాజీ సినిమాలో రీ క్రియేట్ చేశారు.

శివాజీ సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఓ ఫైట్ ఉంటుంది. “పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగల్ గా వస్తుంది” అనే చెప్పే యాక్షన్ సీక్వెన్స్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుటుంది. అయితే ఆ సీక్వెన్స్ లో అపరిచితుడు సీన్ ని రీ క్రియేట్ చేస్తూ కామెడీ జనరేట్ చేశారు. రజినీకాంత్ పక్కన కనిపించే వివేక్(Vivek).. అపరిచితుడిగా నటించారు. సినిమా నిడివి ఎక్కువ కావడంతో.. ఫైనల్ కట్ నుంచి ఆ సీన్ ని తొలిగించారు. ఆ డిలీట్ సీన్ ని ఒకసారి చూసేయండి.

 

Also Read : Ooruperu Bhairavakona will postpone : సందీప్ కిషన్ వెనక్కి తగ్గక తప్పట్లేదా.. భైరవ కోన మరోసారి వాయిదా..?